4: టెస్టు కెరీర్‌లోనే ది బెస్ట్ ర్యాంకులో కోహ్లీ
హైదరాబాద్: ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకుకి చేరుకున్నాడు. విశాఖపట్నం వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టులో కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులు సాధించడంతో టెస్టు ర్యాంకింగ్స్‌లో 4వ స్ధానంలో నిలిచాడు.
50 టెస్టుల కెరీర్‌లో మొత్తం 800 పాయింట్ల మార్కును కోహ్లీ తొలిసారి అధిగమించాడు. ఈ ఘనత సాధించిన 11వ భారత్ ఆటగాడు కావడం విశేషం. రెండో టెస్టులో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును కైవసం చేసుకున్న కోహ్లీ పది స్ధానాలు ఎగబాకి నాలుగో స్ధానంలో నిలిచాడు. ఇక ట్వంటీ20 ర్యాంకింగ్స్ విషయానికి వస్తే నెంబర్ వన్ స్ధానంలో నిలిచాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో టీమిండియా బోణీ చేసింది.
టెస్టు సిరిస్‌లో భాగంగా రాజ్‌కోట్‌లో జరిగిన తొలి టెస్టును డ్రాగా ముగించిన టీమిండియా విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్టులో 246 పరుగుల ఇంగ్లాండ్‌పై భారీ విజయం సాధించింది. ఇంగ్లాండ్‌పై 246 పరుగులతో ఘన విజయం సాధించడంలో కోహ్లీతో పాటు భారత బౌలర్లు ముఖ్య భూమిక పోషించారు.
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరిస్‌లో కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తన టెస్టు కెరీర్‌లోనే కోహ్లీ నాలుగో స్ధానంలో నిలవడం ఇదే మొదటిసారి. నవంబర్ 22, 2016 నాటికి టెస్టుల్లో టాప్ 10 స్ధానంలో నిలిచిన బ్యాట్స్‌మెన్లు వీరే:

స్టీవ్ స్మిత్
897 పాయింట్లతో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు.

జో రూట్
844 పాయింట్లతో ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్ మెన్ జో రూట్ రెండో స్ధానంలో ఉన్నాడు.

కేన్ విలియమ్సన్
838 పాయింట్లతో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మూడో స్ధానంలో కొనసాగుతున్నాడు.

విరాట్ కోహ్లీ
822 పాయింట్లతో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నాలుగో స్ధానంలో ఉన్నాడు. తన టెస్టు కెరీర్‌లోనే కోహ్లీ తొలిసారి నాలుగో స్ధానంలో నిలిచాడు.

హషీం ఆమ్లా
809 పాయింట్లతో దక్షిణాఫ్రికాకు చెందిన స్టార్ బ్యాట్స్‌మెన్ హషీం ఆమ్లా ఐదో స్ధానంలో నిలిచాడు. పాకిస్థాన్‌కు చెందిన యునిస్ ఖాన్ 6వ స్ధానంలో ఉండగా, ఏబీ డివిల్లియర్స్ (దక్షిణాఫ్రికా), డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా), ఛటేశ్వర పుజారా (ఇండియా) 9వ స్ధానంలో ఉండగా, అలెస్టర్ కుక్ (ఇంగ్లాండ్) పదో స్ధానంలో ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications