న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ICC Test rankings: కోహ్లీదే అగ్రస్థానం, బాబర్‌ అజామ్‌ తొలిసారి టాప్-10లోకి!

ICC Test rankings: Virat Kohli retains top spot among batsmen, Bumrah 6th among bowlers

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఐసీసీ సోమవారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లీ 928 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ 911 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.

విరాట్ కోహ్లీ క్రికెట్‌లో క్రిస్టియానో రొనాల్డో: లారా ప్రశంసల వర్షంవిరాట్ కోహ్లీ క్రికెట్‌లో క్రిస్టియానో రొనాల్డో: లారా ప్రశంసల వర్షం

17 పాయింట్ల వత్యాసం

17 పాయింట్ల వత్యాసం

వీరిద్దరి మధ్య కేవలం 17 పాయింట్ల వత్యాసం మాత్రమే ఉంది. న్యూజిలాండ్‌ జరిగిన తొలి టెస్టులో స్మిత్‌(43, 16) పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మూడో ర్యాంకులో ఉన్నాడు. పుజారా(791 రేటింగ్‌ పాయింట్లు) నాలుగో స్థానంలో ఉండగా, రహానే(759 రేటింగ్‌ పాయింట్లు) ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.

పెర్త్ టెస్టులో పరుగుల వరద

పెర్త్ టెస్టులో పరుగుల వరద

పెర్త్ టెస్టులో పరుగుల వరద పారించిన ఆసీస్ బ్యాట్స్‌మన్ లబూషేన్‌(143, 50) మూడు స్థానాలు ఎగబాకి ఐదో స్థానంలో నిలిచాడు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో పాక్ యువ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ అజామ్‌(102) సెంచరీ సాధించడంతో అంతర్జాతీయ టెస్టు ర్యాంకింగ్స్‌లో మరింతపైకి దూసుకొచ్చాడు.

టాప్‌-10లోకి బాబర్ అజామ్

టాప్‌-10లోకి బాబర్ అజామ్

తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో బాబర్ అజామ్‌ తొలిసారి టాప్‌-10లో చోటు దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు 13వ స్థానంలో ఉన్న బాబర్‌ అజామ్‌ నాలుగు స్థానాలు మెరుగపరుచుకుని 9వ స్థానానికి ఎగబాకాడు. ఇక, బౌలర్ల విభాగంలో భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా ఆరో స్థానానికి పడిపోయాడు.

ఆరో స్థానానికి పడిపోయిన బుమ్రా

ఆరో స్థానానికి పడిపోయిన బుమ్రా

గాయం కారణంగా బుమ్రా గత కొంతకాలంగా బారత మ్యాచ్‌లకు దూరమవుతున్న సంగతి తెలిసిందే. ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్ అగ్రస్థానంలో ఉండగా సఫారీ పేసర్ రబాడ రెండో ర్యాంకులో కొనసాగుతున్నాడు. టెస్టు ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా రెండో స్థానంలో ఉండగా, అశ్విన్ ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.

Story first published: Monday, December 16, 2019, 17:50 [IST]
Other articles published on Dec 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X