Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జస్ట్ ఒక్క పాయింట్‌‌తో మిస్: దిగ్గజాల సరసన చోటు కోల్పోయిన కోహ్లీ

ICC Test rankings: Virat Kohli remains number one batsman despite England series loss

హైదరాబాద్: ఒక్క పాయింట్ తేడాతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దిగ్గజాల సరసన చోటు కోల్పోయాడు. తాజాగా సోమవారం ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో విరాట్ కోహ్లీ తన స్థానాన్ని పదిలం చేసుకున్న సంగతి తెలిసిందే. సౌతాంప్టన్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఓడినా రెండు ఇన్నింగ్స్‌ల్లో 46, 58 పరుగులు చేయడంతో కెరీర్‌లో అత్యధిక రేటింగ్‌ పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు.

ప్రస్తుతం విరాట్ కోహ్లీ 937 పాయింట్లతో టెస్టు ర్యాంకుల్లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. తద్వారా అత్యుత్తమ రేటింగ్‌ పాయింట్ల పరంగా 11వ స్థానంలో కొనసాగుతున్నాడు. మరొక్క పాయింట్‌ సాధించి ఉంటే మాజీ క్రికెట్ దిగ్గజాలైన గ్యారీ సోబర్స్‌, క్లైవ్‌ వాల్‌కోట్‌, వివియన్‌ రిచర్డ్స్‌, కుమార సంగక్కర సరసన చేరి ఏడో స్థానంలో నిలిచేవాడు.

8 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ 544 పరుగులు

8 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ 544 పరుగులు

ఈ సిరీస్‌లో 8 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ 544 పరుగులు చేశాడు. తద్వారా కోహ్లీ ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లీషు గడ్డపై అత్యధిక పరుగులు (544) చేసిన భారత కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ (2006లో విండీస్‌పై 496) పేరిట ఉంది.

ఆరో స్థానంలో పుజారా

ఆరో స్థానంలో పుజారా

ఇక, ర్యాంకింగ్స్‌లో పుజారా ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో తన 763 పాయింట్లను 798కి పెంచుకున్నాడు. బౌలర్ల జాబితాలో పేసర్‌ షమీ మూడు స్థానాలు ఎగబాకి 19వ ర్యాంకులో, ఇషాంత్‌ శర్మ ఒక ర్యాంకు మెరుగై 25వ స్థానంలో ఉన్నారు. జస్ప్రీత్‌ బుమ్రా 487 పాయింట్లతో 37వ ర్యాంకులో ఉన్నాడు.

 నాలుగో టెస్టులో 60 పరుగుల తేడాతో ఓటమి

నాలుగో టెస్టులో 60 పరుగుల తేడాతో ఓటమి

సౌతాంప్టన్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా 60 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 245 పరుగుల లక్ష్య ఛేదనలో హాఫ్‌ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లి (58) వేగవంతంగా 4వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి కెప్టెన్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా నాల్గో టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మరో రికార్డు నెలకొల్పాడు.

 కెప్టెన్‌గా మరో మైలురాయిని

కెప్టెన్‌గా మరో మైలురాయిని

ఆ సిరీస్‌ ద్వారా ఇప్పటికే టెస్టుల్లో వేగవంతంగా ఆరువేల పరుగుల మైలురాయిని అందుకుని రెండో భారత క్రికెటర్‌గా నిలిచిన కోహ్లి.. కెప్టెన్‌గా మరో మైలురాయిని కూడా అందుకున్నాడు. ఇప్పటివరకూ ఈ రికార్డు బ్రియాన్‌ లారా పేరిట ఉండగా దాన్ని కోహ్లి సవరించాడు. లారా కెప్టెన్‌గా 40 టెస్టుల్లో 4 వేల పరుగులు చేయగా, కోహ్లి 39 టెస్టు మ్యాచ్‌ల్లోనే ఆ రికార్డు సాధించాడు.

Story first published: Monday, September 3, 2018, 18:26 [IST]
Other articles published on Sep 3, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+