Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ICC Test rankings: కోహ్లీదే అగ్రస్థానం... రెండో స్థానానికే పరిమితమైన స్మిత్

ICC Test rankings: Virat Kohli finishes 2019 as top-ranked batsman

హైదరాబాద్: 2019 సంవత్సరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి కలిసొచ్చింది. వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన విరాట్ కోహ్లీ... తాజాగా టెస్టు ర్యాంకింగ్స్‌లో సైతం అగ్రస్థానంలోనే నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మంగళవారం విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ 928 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.

రెండో స్థానంలో నిలిచిన ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్(911)తో పోలిస్తే విరాట్ కోహ్లీ 17 పాయింట్లు ముందంజలో ఉన్నాడు. ఇక, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 864 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో నిలవగా... ఛటేశ్వర్ పుజారా(791) రేటింగ్ పాయింట్లతో నాలుగో స్థానంలో నిలవగా... మార్నస్ లబుషేన్(786) పాయింట్లతో ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు.

కరాచీ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో సెంచరీ సాధించడం ద్వారా పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్ మూడు స్థానాలు ఎగబాకి తన కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకుకి చేరుకున్నాడు. ఈ క్రమంలో ఆరో స్థానంలో ఉన్న భారత బ్యాట్స్‌మన్ అజ్యింకే రహానేను వెనక్కి నెట్టాడు.

దీంతో ఏడో స్థానంలో రహానే, ఎనిమిదవ స్థానంలో డేవిడ్ వార్నర్, తొమ్మిదో స్థానంలో జో రూట్, పదో స్థానంలో రాస్ టేలర్‌లు ఉన్నారు. ఇక, టాప్-20లో మయాంక్ అగర్వాల్(12), రోహిత్ శర్మ(15)లకు చోటు దక్కింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ షిప్‌లో 360 పాయింట్లతో టీమిండియా ఏ జట్టుకు అందనంత ఎత్తులో ఉంది.

టీమిండియా వరుసగా వెస్టిండిస్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై టెస్టు సిరిస్‌లను నెగ్గిన సంగతి తెలిసిందే. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించడంతో 216 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. శ్రీలంకతో ముగిసిన రెండు టెస్టుల సిరిస్‌లో ఒక మ్యాచ్‌లో పాక్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఫలితంగా పాకిస్థాన్ ఖాతాలో 60 పాయింట్లు అదనంగా చేరడంతో ప్రస్తుతం 80 పాయింట్లతో ఉంది. మరోవైపు శ్రీలంక ఖాతాలో కూడా 80 పాయింట్లే ఉన్నాయి.

Story first published: Tuesday, December 24, 2019, 15:55 [IST]
Other articles published on Dec 24, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+