For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ICC Test rankings: 2019ని అగ్రస్థానంతో ముగించిన కోహ్లీ, రెండో స్థానంలో స్మిత్

ICC Test rankings: Virat Kohli finishes 2019 as No. 1 batsman after Steve Smiths ordinary run vs New Zealand


హైదరాబాద్:
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుసగా రెండో ఏడాది అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ మేరకు ఐసీసీ సోమవారం ప్రకటించి టెస్ట్ ర్యాంకింగ్స్‌‌లో కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. 928 పాయింట్లతో కోహ్లీ అగ్రస్థానంలో నిలవగా, ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ 911 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.

బాల్ ట్యాంపరింగ్ ఉదంంతం తర్వాత ఏడాది పాటు నిషేధం ముగిసిన తర్వాత యాషెస్ సిరిస్‌లో పునరాగమనం చేసిన స్టీవ్ స్మిత్ యాషెస్ సిరీస్‌లో పరుగులు వరద పారించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఈ సిరీస్‌లో స్మిత్ నాలుగు మ్యాచుల్లో 110.57 యావరేజితో ఏకంగా 774 పరుగులు చేశాడు.

అగ్రస్థానంలో కోహ్లీ

ఫలితంగా టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి ఎగబాకాడు. అయితే, స్వదేశంలో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో జరిగిన టెస్టు సిరీస్‌లో కోహ్లీ అద్భుత ప్రదర్శన చేయడంతో తిరిగి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. అదే సమయంలో పాక్‌తో జరిగిన సిరీస్‌లో స్మిత్ పేలవ ప్రదర్శన చేశాడు.

కోహ్లీని దాటే అవకాశం వచ్చినా

కోహ్లీని దాటే అవకాశం వచ్చినా

ప్రస్తుంత న్యూజిలాండ్ జరుగుతున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో స్మిత్‌కు మరోమారు విరాట్ కోహ్లీని దాటే అవకాశం వచ్చినా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కివీస్‌తో ఇప్పటికే ముగిసిన రెండు టెస్టుల్లో 37.75 యావరేజితో 151 పరుగులు మాత్రమే చేశాడు. ఫలితంగా రెండో స్థానంలో నిలిచాడు.

అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో

అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో

ఇక, ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో మార్నస్ లబుషేన్ అగ్రస్థానంలో నిలవగా స్మిత్ రెండో స్థానంలో నిలిచాడు. లబుషేన్ ఈ ఏడాది 11 మ్యాచ్‌లు ఆడి 1104 పరుగులు చేయగా, స్మిత్ 8 మ్యాచుల్లో 965 పరుగులు చేశాడు. అయితే, ఈ జాబితాలో కోహ్లీ 13వ స్థానంలో ఉన్నాడు.

8 మ్యాచ్‌లు ఆడి 612 పరుగులు చేసిన కోహ్లీ

8 మ్యాచ్‌లు ఆడి 612 పరుగులు చేసిన కోహ్లీ

ఈ ఏడాది మొత్తంగా 8 మ్యాచ్‌లు ఆడి 612 పరుగులు మాత్రమే చేశాడు. సోమవారం ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్-10లో భారత్ నుంచి ముగ్గురు ఉన్నారు. పుజారా 791 పాయింట్లో ఐదో స్థానంలో నిలవగా, అజింక్య రహానే ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్ (డిసెంబర్ 30, 2019 నాటికి)

ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్ (డిసెంబర్ 30, 2019 నాటికి)

* విరాట్ కోహ్లీ

* స్టీవ్ స్మిత్

* కేన్ విలియంసన్

* మార్నస్ లాబుషేన్

* ఛటేశ్వర్ పూజారా

* బాబర్ అజామ్

* డేవిడ్ హెచ్చరిక

* అజింక్య రహానే

* జో రూట్

* క్వింటన్ డికాక్

Story first published: Monday, December 30, 2019, 17:55 [IST]
Other articles published on Dec 30, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+