Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ICC Test rankings: స్మిత్‌కు చేరువలో, అగ్రస్థానానికి 3 పాయింట్ల దూరంలో కోహ్లీ

ICC Test Rankings : Virat Kohli Closes In On Top-Ranked Steve Smith || Oneindia Telugu
ICC Test rankings: Virat Kohli cuts down Steve Smiths lead after Pink ball Test hundred

హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో ముగిసిన డే నైట్ టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగడంతో టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి మరింతగా చేరువయ్యాడు. ఇండోర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో డబుల్ సెంచరీతో చెలరేగిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తొలిసారి టాప్-10లో చోటు దక్కించుకున్నాడు.

ఐసీసీ మంగళవారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(928 రేటింగ్ పాయింట్లు)తో రెండో స్థానంలో నిలవగా... ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్(931) పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో కోహ్లీ 136 పరుగులతో సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.

ఫలింతగా 25 పాయింట్ల వ్యత్యాసాన్ని కోహ్లీ తగ్గించాడు. తొలి టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన మయాంక్ అగర్వాల్(700 పాయింట్లు)తో తొలిసారి టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. టాప్-10లో నిలిచిన భారత నాలుగో బ్యాట్స్‌మెన్‌గా మయాంక్ అగర్వాల్ అరుదైన ఘనత సాధించాడు.

ఛటేశ్వర్ పుజారా(791), అజ్యింకె రహానే(759) పాయింట్లతో వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ మూడు స్థానాలు ఎగబాకి తొలిసారి ఆల్ రౌండర్ల జాబితాలో టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో బెన్ స్టోక్స్(91,28) పరుగులతో ఫరవాలేదనిపించాడు.

డే నైట్ టెస్టులో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా బౌలర్లు ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్‌లు తమ కెరీర్‌లో అత్యధిక పాయింట్లను సొంతం చేసుకున్నారు. ఇషాంత్ శర్మ(716) పాయింట్లతో 17వ స్థానంలో నిలవగా, ఉమేశ్ యాదవ్(672) పాయింట్లతో 21వ స్థానంలో నిలిచాడు. జులై 2011లో ఇషాంత్ శర్మ తొలిసారి ఏడో స్థానంలో నిలిచి కెరీర్ అత్యుత్తమ ర్యాంకుని అందుకున్నాడు.

Story first published: Tuesday, November 26, 2019, 16:13 [IST]
Other articles published on Nov 26, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+