అశ్విన్ No.1 స్ధానం పదిలం: టాప్ 10లోకి జడేజా
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం ప్రకటించిన బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన నెంబర్ వన్ స్ధానాన్ని నిలబెట్టుకున్నాడు. విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్టులో అశ్విన్ 8 వికెట్లు తీసుకోవడంతో పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్ధానంలో కొనసాగుతున్నాడు.
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో టీమిండియా బోణీ చేసింది. టెస్టు సిరిస్‌లో భాగంగా రాజ్‌కోట్‌లో జరిగిన తొలి టెస్టును డ్రాగా ముగించిన టీమిండియా తాజాగా సోమవారం విశాఖ వేదికగా ముగిసిన రెండో టెస్టులో 246 పరుగుల ఇంగ్లాండ్‌పై భారీ విజయం సాధించింది.
ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో భారత్ ముందంజలో ఉంది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చడంలో అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. దీంతో తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 895 పాయింట్లతో నెంబర్ వన్ స్ధానంలో కొనసాగుతున్నాడు. 867 పాయింట్లతో శ్రీలంక వెటరన్ స్పిన్నర్ రంగన హెరాత్ రెండో స్ధానంలో ఉన్నాడు.
టాప్ 10 బౌలర్ల జాబితాలో అశ్విన్‌తో పాటు మరో స్ఫిన్నర్ రవీంద్ర జడేజా కూడా చోటు దక్కించుకున్నాడు. 795 పాయింట్లతో జడేజా ఆరో స్ధానంలో ఉన్నాడు. రెండో టెస్టులో అశ్విన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరుస్తున్నాడు. అటు బ్యాటింగ్‌లోనూ అశ్విన్ 58 పరుగులతో ఆకట్టుకున్నాడు.
రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ 5 వికెట్లు తీసుకోవడంతో టెస్టు దిగ్గజాల సరసన చేరాడు. (ఒకే ఇన్నింగ్స్‌లో 22 సార్లు 5 వికెట్లు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు) తీసిన టెస్టు దిగ్గజాలు వకార్ యునిస్ (పాకిస్థాన్), మాల్కోమ్ మార్షల్, ఆంబ్రోస్, కోర్ట్నీ వాల్స్ (ఈ ముగ్గురు వెస్టిండిస్‌కు చెందినవారు) సరసన ఇప్పుడు అశ్విన్ చేరాడు.
నవంబర్ 22, 2016 నాటికి టాప్ 5 టెస్టు బౌలర్లు వీరే:

రవిచంద్రన్ అశ్విన్
895 పాయింట్లతో టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్ధానంలో ఉన్నాడు.

రంగన హెరాత్
867 పాయింట్లతో శ్రీలంకకు చెందిన వెటరన్ క్రికెటర్ రంగన హెరాత్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో రెండో స్ధానంలో ఉన్నాడు.

డేల్ స్టెయిన్
852 పాయింట్లతో దక్షిణాఫ్రికాకు చెందిన పేస్ బౌలర్ డేల్ స్టెయిన్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మూడో స్ధానంలో ఉన్నాడు.

జేమ్స్ ఆండర్సన్
850 పాయింట్లతో ఇంగ్లాండ్‌కు చెందిన జేమ్స్ ఆండర్సన్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నాలుగో స్ధానంలో ఉన్నాడు.

స్టువర్ట్ బ్రాడ్
820 పాయింట్లతో ఇంగ్లాండ్‌కు చెందిన స్టువర్ట్ బ్రాడ్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఐదో స్ధానంలో ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications