Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ICC Test Rankings: దుమ్మురేపిన కోహ్లి-జైస్వాల్.. అగ్రస్థానంలో బుమ్రా

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు దుమ్మురేపారు. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రస్థానాన్ని సాధించాడు. దాంతో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ స్థానాన్ని కోల్పోయి రెండో ర్యాంక్‌లో నిలిచాడు. టెస్టుల్లో బుమ్రా మొదటి ర్యాంక్‌ను సాధించడం ఇది రెండోసారి.

బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో బుమ్రా ఆరు వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రవిచంద్రన్ అశ్విన్ కంటే (869 పాయింట్లు) ఒక్క రేటింగ్ పాయింట్ అధికంగా సాధించి తొలిస్థానానికి చేరాడు. ఇక ఈ సిరీస్‌లో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచిన యశస్వీ జైస్వాల్ రెండు స్థానాలు ఎగబాకి బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి చేరాడు.

ICC Test Rankings Shake-Up Jasprit Bumrah Reclaims No 1 Bowler Spot as Jaiswal and Kohli Soar

మరోవైపు విరాట్ కోహ్లి ఏకంగా ఆరు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంక్‌కు చేరుకున్నాడు. రిషభ్ పంత్ మూడు స్థానాలు కోల్పోయి తొమ్మిదో ర్యాంక్‌లో, రోహిత్ శర్మ అయిదు స్థానాలు కోల్పోయి 15వ ర్యాంక్‌లో, శుభ్‌మన్ గిల్ రెండు స్థానాలు కోల్పోయి 16వ ర్యాంక్‌లో నిలిచాడు. బ్యాటింగ్‌లో జో రూట్, కేన్ విలియమ్సన్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక బౌలింగ్‌లో బుమ్రా, అశ్విన్‌తో పాటు రవీంద్ర జడేజా (6వ ర్యాంక్) టాప్-10లో ఉన్నాడు. బంగ్లాదేశ్ సిరీస్‌లో తుదిజట్టులో చోటు దక్కని కుల్‌దీప్ యాదవ్ 16వ స్థానంలో నిలిచాడు.

ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయిన అక్షర్ పటేల్ ఓ స్థానాన్ని కోల్పోయి ఏడో స్థానంలో నిలిచాడు. ఇక టీమ్ ర్యాంకింగ్స్‌లో టీ20, వన్డేల్లో టీమిండియా అగ్రస్థానంలో ఉంది. టెస్టుల్లో రెండో స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో ఆస్ట్రేలియా ఉంది.

Story first published: Wednesday, October 2, 2024, 15:47 [IST]
Other articles published on Oct 2, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+