Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ICC Test Rankings: జాక్‌పాట్ కొట్టిన పాకిస్తాన్ ప్లేయర్లు: ఆ కేటగిరీలో మనోడు ఒక్కడే

 ICC Test Rankings: Shaheen Afridi enters top 10 and Babar Azam moves to No 7 position
ICC Test Rankings : జాక్‌పాట్ కొట్టిన Pak ప్లేయర్లు.. అయిదు, ఆరు స్థానాల్లో Kohli,Rohit

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్.. తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. ఈ ర్యాంకింగ్స్ ఒకరకంగా పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్లకు ఉత్సాహాన్ని ఇచ్చేవిగా కనిపిస్తోన్నాయి. వారి జోష్‌ను రెట్టింపు చేసేవిలా ఉంటోన్నాయి. పాకిస్తాన్‌కు చెందిన టెస్ట్ క్రికెటర్లు.. తమ ర్యాంకింగ్స్‌ను మరింత మెరుగుపర్చుకోవడం, టాప్-10లో చోటు దక్కించుకోవడమే దీనికి కారణం. వెస్టిండీస్‌తో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకున్న తరువాత ఈ ర్యాంకింగ్స్ వెలువడ్డాయి. విండీస్ వీరులతో రెండో టెస్ట్ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన ఇద్దరు ప్లేయర్లు ర్యాకింగ్స్‌లో పైపైకి దూసుకెళ్లారు.

ఐసీసీ టెస్టుల బ్యాటింగ్ విభాగంలో టాప్-10లో ముగ్గురు మనోళ్లే..

ఐసీసీ టెస్టుల బ్యాటింగ్ విభాగంలో టాప్-10లో ముగ్గురు మనోళ్లే..

ఐసీసీ కొద్దిసేపటి కిందటే టెస్ట్ క్రికెట్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగానికి సంబంధించిన ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. ఈ కేటగిరీలో తొలి 10 స్థానాల్లో నిలిచిన క్రికెటర్ల పేర్లు ప్రకటించింది. ఇందులో ముగ్గురు భారత క్రికెట్ జట్టు ప్లేయర్లు ఉన్నారు. ఆ ముగ్గురూ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషభ్ పంత్. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అయిదు, ఆరు స్థానాల్లో నిలిచారు. రిషభ్ పంత్‌ది ఎనిమిదో ప్లేస్. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య ఉన్న పాయింట్ల తేడాలో పెద్దగా తేడా ఏమీ లేదు. కోహ్లీ 776, రోహిత్ 773 పాయింట్లతో అయిదు, ఆరు స్థానాల్లో నిలిచారు. 724 పాయింట్లతో రిషభ్ పంత్ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.

టాప్-10 లిస్ట్ ఇదే..

టాప్-10 లిస్ట్ ఇదే..

ఇక మిగిలిన వారిలో న్యూజిలాండ్ కేప్టెన్ కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో కొనసాగుతోన్నాడు. అతను అందుకున్న పాయింట్లు 901. ఇంగ్లాండ్ టెస్ట్ కేప్టెన్ జో రూట్ రెండో స్థానంలో నిలిచాడు. అతని పాయింట్లు 893. 891 పాయింట్లతో ఆస్ట్రేలియా ప్లేయర్ స్టీవ్ స్మిత్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆసీస్‌కే చెందిన మర్ముస్ లంబుషేన్ 878 పాయింట్లతో నాలుగో స్థానాన్ని ఆక్రమించాడు. అదే టీమ్‌కు చెందిన డేవిడ్ వార్నర్ 724 పాయింట్లతో తొమ్మిది, 717 పాయింట్లతో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డీకాక్ పదో స్థానంలో నిలిచాడు.

సెవెన్త్ ప్లేస్‌లో బాబర్ ఆజమ్

సెవెన్త్ ప్లేస్‌లో బాబర్ ఆజమ్

కాగా- పాకిస్తాన్ కేప్టెన్ బాబర్ ఆజమ్ తన స్థానాన్ని మెరుగుపర్చుకుని ఏడో ప్లేస్‌కు ఎగబాకాడు. విండీస్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో అతను రాణించడమే దీనికి కారణమైంది. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్‌లో బాబర ఆజామ్ 75 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్‌లో 33 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 109 పరుగుల తేడాతో కరేబియన్ జట్టును వారి గడ్డ మీదే ఓడించింది పాకిస్తాన్.

బౌలర్లలో టాప్ టెన్‌లోకి దూసుకొచ్చిన అఫ్రిది

బౌలర్లలో టాప్ టెన్‌లోకి దూసుకొచ్చిన అఫ్రిది

టెస్ట్ మ్యాచ్‌ల బౌలింగ్ కేటగిరీలో పాకిస్తాన్‌కే చెందిన లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ షహీన్ షా అఫ్రిది తొలి పది స్థానాల్లోకి దూసుకొచ్చాడు. ఎనిమిదో ప్లేస్‌లో నిలిచాడు. వెస్టిండీస్‌తో తలపడిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో అఫ్రిది రెచ్చిపోయి బౌలింగ్ చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అతను 10 వికెట్లను పడగొట్టాడు. తొలి ఇన్నింగ్‌లో ఆరు, రెండో ఇన్నింగ్‌లో నాలుగు వికెట్లను తీసుకున్నాడు. తొలి టెస్ట్ మ్యాచ్‌లోనూ అఫ్రిది నిలకడగా రాణించిన విషయం తెలిసిందే. వెస్టిండీస్ విజయం సాధించినప్పటికీ తొలి టెస్ట్‌లో ఇన్నింగ్‌కు నాలుగు చొప్పున ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.

అన్నింట్లో బెస్ట్..

అన్నింట్లో బెస్ట్..

ఈ ఏడాది ఇప్పటిదాకా జరిగిన టెస్ట్ క్రికెట్ మ్యాచుల్లో అత్యుత్తమ బౌలింగ్ ఫిగర్లను నమోదు చేసిన ఏకైక బౌలర్ అఫ్రిదీ ఒక్కడే. అత్యధిక వికెట్లను తీసుకోవడంతో పాటు బెస్ట్ బౌలింగ్ యావరేజ్ బెస్ట్ బౌలింగ్ స్ట్రైక్ రేట్, బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్, బెస్ట్ ఎకానమీని నమోదు చేశాడీ స్పీడ్ స్టర్. మోస్ట్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. కాగా- పాకిస్తాన్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఫవాద్ ఆలమ్ తన ర్యాంకింగ్‌ను మెరుగుపర్చుకున్నాడు. 21వ స్థానంలో నిలిచాడు. కింగ్స్‌టన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్‌లో ఫవాద్ ఆలమ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.

రెండో స్థానంలో అశ్విన్..

టెస్ట్ బౌలింగ్ కేటగిరీలో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానంలో నిలిచాడు. అతనికి దక్కిన పాయింట్లు 848. అశ్విన్‌ మినహాంచి టాప్ టెన్‌లో మరే టీమిండియా బౌలర్‌కు కూడా స్థానాన్ని సంపాదించుకోలేకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. 908 పాయింట్లతో ఆస్ట్రేలియా పేస్ బౌలర్ పాట్ కమ్మిన్స్ 908 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ బౌలింగ్ వెన్నెముక టిమ్ సౌథీ టాప్-3లో నిలిచాడు. టిమ్ సౌథీకి లభించిన పాయింట్లు 824.

మిగిలిన స్థానంలో ఉన్నది వీరే..

ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్ తొలి మూడు స్థానాల్లో నిలవగా.. ఆసీస్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్, కివీస్ పేసర్ నీల్ వాగ్నర్ నాలుగు, అయిదు ప్లేస్‌లో ఉన్నారు. హేజిల్‌వుడ్-816, వాగ్నర్-810 పాయింట్లతో నిలిచారు. ఇంగ్లాండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జిమ్మీ అండర్సన్ 800 పాయింట్లతో ఆరు, దక్షిణాఫ్రికా బౌలింగ్ తురుఫుముక్క కగిసో రబడ 798 పాయింట్లతో ఏడు, విండీస్ పేసర్ జేసన్ హోల్డర్ 766 పాయింట్లతో తొమ్మిదో స్థానాన్ని దక్కించుకున్నారు.

ఇంగ్లాండ్‌కే చెందిన స్టువర్ట్ బ్రాడ్ 764 పాయింట్లతో పదో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ బౌలర్లు ఇద్దరేసి చొప్పున తొలి 10 మంది జాబితాలో చోటు దక్కించుకున్నారు.

Story first published: Wednesday, August 25, 2021, 14:56 [IST]
Other articles published on Aug 25, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+