Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టెస్టు ర్యాంకింగ్స్‌: 36 ర్యాంకులు ఎగబాకి కెరీర్‌ బెస్ట్‌ ర్యాంకుకు రోహిత్‌.. టాప్‌-10లోకి అశ్విన్‌

IND vs SA 2019,1st Test,ICC Test Rankings : Rohit Sharma Moves To Career-Best Position
ICC Test Rankings: Rohit Sharma reaches career-best spot, Virat Kohli drops below 900 points

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు సత్తాచాటారు. ఓపెనర్ 'హిట్‌మ్యాన్‌' రోహిత్‌ శర్మ కెరీర్‌ బెస్ట్‌ ర్యాంకుకు చేరుకున్నాడు. మరో ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్‌ సైతం 38 స్థానాలు మెరుగుపరుచుకొన్నాడు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుత ప్రదర్శనతో టాప్‌-10లోకి దూసుకొచ్చాడు. అయితే ఈ ముగ్గురు సౌతాఫ్రికాతో విశాఖపట్నంలో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో విజృంభించడంతో ర్యాంకింగ్స్‌లో దూసుకుపోయారు.

కెరీర్‌ బెస్ట్‌ ర్యాంకుకు రోహిత్‌:

కెరీర్‌ బెస్ట్‌ ర్యాంకుకు రోహిత్‌:

ఓపెనర్‌గా బరిలోకి దిగిన తొలి టెస్టులోనే రెండు శతకాలతో (176, 126) విజృంభించిన రోహిత్‌ శర్మ ర్యాంకింగ్స్‌లో ఒకేసారి 36 స్థానాలు ఎగబాకి కెరీర్‌ అత్యుత్తమ 17వ ర్యాంకుకు చేరుకున్నాడు. గతంలో ఆడిన 27 టెస్టుల్లో మిడిల్‌ ఆర్డర్‌లో బరిలోకి దిగిన రోహిత్.. విశాఖ టెస్ట్ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి భారత్‌ భారీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ 38 స్థానాలు మెరుగుపరుచుకొని 25వ ర్యాంకుకు చేరాడు.

 టాప్‌ ర్యాంకులో స్మిత్:

టాప్‌ ర్యాంకులో స్మిత్:

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ రెండో స్థానాన్ని నిలబెట్టుకొన్నా.. అతడి పాయింట్లు 899కి పడిపోయాయి. జనవరి 2018 తర్వాత కోహ్లీ పాయింట్ల సంఖ్య 900 కంటే తక్కువకు పడిపోవడం ఇదే మొదటిసారి. టాప్‌ ర్యాంకులో ఉన్న స్టీవ్‌ స్మిత్‌ (937, ఆస్ట్రేలియా) కంటే 38 పాయింట్లు తక్కువ ఉన్నాయి.

టాప్‌-10లో అశ్విన్:

టాప్‌-10లో అశ్విన్:

టెస్టు బౌలర్ల జాబితాలో అశ్విన్‌ మళ్లీ టాప్‌-10లోకి చేరాడు. తొలి టెస్టులో 8 వికెట్లు తీయడంతో 4 స్థానాల్ని మెరుగుపర్చుకొని పదో ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో అశ్విన్‌ టాప్‌-5లో అడుగుపెట్టాడు. కెరీర్‌ బెస్ట్‌గా 710 పాయింట్లు దక్కించుకున్న పేసర్‌ మొహమ్మద్ షమీ రెండు స్థానాలు ఎగబాకి 16వ ర్యాంకుకు చేరాడు. ఆల్‌రౌండర్లలో జడేజా రెండో ర్యాంక్‌ చేజిక్కించుకున్నాడు.

రెండో స్థానంలో భారత్:

రెండో స్థానంలో భారత్:

మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌ రెండో స్థానాన్ని నిలబెట్టుకొంది. మూడో ర్యాంకర్‌ ఇంగ్లండ్‌ (122) కంటే భారత్ (125 పాయింట్లు) 3 పాయింట్లు ముందుంది. ఆస్ట్రేలియా (151) టాప్‌ ర్యాంకులో కొనసాగుతోంది. టీ20ల్లో కూడా ఆసీస్ టాప్‌ ర్యాంకులో ఉండగా.. భారత్‌ ఐదో స్థానంలో ఉంది.

Story first published: Tuesday, October 8, 2019, 12:32 [IST]
Other articles published on Oct 8, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+