For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ICC rankings: మూడు ఫార్మాట్లలో టాప్‌-10.. రోహిత్ అరుదైన ఘనత!!

ICC Rankings : Rohit Sharma joins Kohli And Gambhir In Elite ICC Rankings List || Oneindia Telugu
 ICC Test rankings: Rohit Sharma joins Virat Kohli and Gautam Gambhir in elite list

దుబాయ్: ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా, భారత్ మధ్య జరిగిన మూడు టెస్ట్‌ల సిరీస్ ముగిసిన నేపథ్యంలో తాజాగా ఐసీసీ టెస్ట్ ర్యాంకులను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఓపెనర్ 'హిట్‌మ్యాన్‌' రోహిత్ శర్మ టాప్ లేపాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో పరుగుల వరద పారించిన రోహిత్.. ఏకంగా 12 స్థానాలు ఎగబాకి టాప్‌-10లో చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌లో టెస్ట్‌ల్లో ఓపెనర్‌గా ఆరంగేట్రం చేసిన రోహిత్ శర్మ మొత్తం 529 పరుగులు చేసి 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అందుకున్నాడు.

రాంచీ టెస్టుకు ముందు 22వ స్థానంలో ఉన్న రోహిత్‌.. ఆ టెస్టులో డబుల్‌ సెంచరీ చేయడంతో ఏకంగా 12 స్థానాలు ఎగబాకాడు. 722 పాయింట్లతో 10వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. ఇది రోహిత్‌కు అత్యున్నత ర్యాంకు. ఐసీసీ అన్ని ఫార్మట్లలో టాప్‌ 10లో నిలిచిన రెండో బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ నిలిచాడు. ప్రస్తుతం కెప్టెన్ విరాట్‌ కోహ్లీ మాత్రమే మూడు ఫార్మట్లలో టాప్‌-10లో కొనసాగుతున్నాడు.

రోహిత్‌శర్మ కెరీర్‌లో మరో చిరస్మరణీయ ఘనత అందుకున్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడు ఫార్మాట్లలోనూ టాప్‌-10లో నిలిచిన భారత మూడో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. విరాట్‌ కోహ్లీ, మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ తర్వాత ఈ ఘనత సాధించిన భారత ఆటగాడిగా అవతరించాడు. ఇదివరకు కోహ్లీ మూడు ఫార్మాట్లలోనూ నంబర్‌వన్‌గా నిలిచాడు. గంభీర్‌ టెస్టు, టీ20ల్లో నంబర్‌వన్‌గా .. వన్డేల్లో 8వ స్థానంలో నిలిచాడు.

ఇక టెస్టు బ్యాట్స్‌మన్‌ చటేశ్వర పుజారా నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. రాంచీ టెస్టులో సెంచరీ చేసిన వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే కెరీర్‌లో అత్యుత్తమ ఐదో స్థానానికి చేరుకున్నాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత బ్యాట్స్‌మన్‌ టాప్‌-10లో నలుగురు ఉండటం విశేషం. మయాంక్ అగర్వాల్‌కు 18 ర్యాంకు దక్కింది. పేసర్లు మహ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌ వరుసగా 15, 24 ర్యాంకుల్లో ఉన్నారు. ఆల్‌రౌండర్స్‌ జాబితాలో రవీంద్ర జడేజా రెండో స్థానంలో ఉన్నాడు.

దక్షిణాఫ్రికా జట్టును 3-0తో వైట్‌వాష్‌ చేయడంతో టెస్టుల్లో టీమిండియా ఆగ్రస్తానానికి మరింత బలం చేకూరింది. 119 రేటింగ్‌ పాయింట్లతో టీమిండియా ఆగ్రస్థానంలో కొనసాగుతోంది. తరువాతి స్థానాలలో న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి.

Story first published: Thursday, October 24, 2019, 17:15 [IST]
Other articles published on Oct 24, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+