నంబర్ వన్‌గా జడేజా
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ప్రపంచ నంబర్ వన్‌గా అవతరించాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్‌ను వెనక్కినెట్టి మరి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మొదటి స్థానంలో ఉన్న రవీంద్ర జడేజా ఖాతాలో 406 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇక రెండో స్థానంలో ఉన్న హోల్డర్ ఖాతాలో 382 పాయింట్లు ఉన్నాయి.

జడేజా విశ్వరూపం
ఇటీవల శ్రీలంకతో ముగిసిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా విశ్వరూపం చూపించాడు. దీంతో ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబవర్ వన్‌గా అవతరించాడు. ఈ టెస్టులో బ్యాటర్‌గా తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా 175 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌లో చెలరేగాడు. ఆ తర్వాత బౌలింగ్‌లో జడ్డూ దుమ్ములేపాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో 4 వికెట్లు కలిపి ఈ మ్యాచ్‌లో మొత్తం 9 వికెట్లు తీశాడు. కాగా ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా చాలా కాలం నుంచి భారత క్రికెట్ జట్టులో నిలకడగా రాణిస్తున్నాడు.

మూడో స్థానంలో అశ్విన్
ఆల్‌రౌండర్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్ సైతం సత్తా చాటాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ఆల్‌రౌండర్ జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ మూడో స్థానంలో నిలిచాడు. అతని ఖాతాలో 347 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. బౌలింగ్ జాబితాలో కూడా అశ్విన్ సత్తా చాటాడు. 850 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. కాగా ఇటీవల శ్రీలంకతో ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో అశ్విన్ బ్యాట్‌తో, బాల్‌తో రాణించాడు. బ్యాట్‌తో తొలి ఇన్నింగ్స్‌లో 61 పరుగులు చేసిన అశ్విన్, బౌలర్‌గా 5 వికెట్లు తీశాడు.

టాప్ 5లో వారు కూడా
ఆల్‌రౌండర్ల జాబితాలో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబుల్ హాసన్, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కూడా టాప్ 5లో నిలిచారు. షకీబ్ నాల్గో స్థానంలో, స్టోక్స్ ఐదో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత ఆరో స్థానంలో మిచెల్ స్టార్క్, ఏడో స్థానంలో కైల్ జేమీషన్, ఎనిమిదో స్థానంలో గ్రాండ్‌హోం, తొమ్మిదో స్థానంలో పాట్ కమిన్స్, పదో స్థానంలో క్రిస్ వోక్స్ ఉన్నారు.

ధోనిని అధిగమించిన పంత్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ పదో స్థానానికి చేరుకున్నాడు. పదో స్థానానికి చేరుకున్న రిషబ్ పంత్ ఖాతాలో 723 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో చేరిన మొదటి భారత వికెట్ కీపర్‌గా పంత్ రికార్డు సృష్టించాడు. గతంలో మహేంద్రసింగ్ ధోని కూడా ఎప్పుడూ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో చోటు సంపాదించలేదు. దీంతో ధోనిని అధిగమించి మరి పంత్ టాప్ 10లో చేరడం గమనార్హం. కాగా టీమిండియా టెస్టు జట్టులోకి అడుగుపెట్టినప్పటి నుంచి రిషబ్ పంత్ నిలకడగా రాణిస్తున్న సంగతి తెలసిందే.


Click it and Unblock the Notifications












