Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రవీంద్ర జడేజాకు బిగ్ షాక్ ఇచ్చిన రవిచంద్రన్ అశ్విన్: మయాంక్, ఇజాజ్ పటేల్ జూమ్

ICC Test Rankings: Ravi Ashwin Replaces Ravindra Jadeja, Mayank and Ajaz Patel zoom up

ముంబై: భారత క్రికెట్ జట్టు టెస్ట్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ నయా రికార్డ్ నెలకొల్పాడు. తన తోటి క్రికెటర్, టీమ్‌మేట్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు బిగ్ షాక్ ఇచ్చాడు. మరో టెస్ట్ క్రికెటర్ మయాంక్ అగర్వాల్, న్యూజిలాండ్ స్పిన్ సంచలనం ఇజాజ్ పటేల్ తమ సత్తా చాటారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్.. తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో వీరంతా తమ స్థానాన్ని మెరుగుపర్చుకున్నారు. కేరీర్‌లో అత్యుత్తమ ర్యాంకులను సాధించారు. న్యూజిలాండ్‌తో ముగిసిన టెస్ట్ సిరీస్.. వారిని అత్యుత్తమంగా నిలబెట్టింది.

రెండో స్థానంలో రవి అశ్విన్

రెండో స్థానంలో రవి అశ్విన్

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కొద్దిసేపటి కిందటే టెస్ట్ ఫార్మట్‌కు సంబంధించిన ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఆల్‌రౌండర్ కేటగిరి కింద ర్యాంకులను ప్రత్యేకంగా కేటాయించింది. ఈ రెండింటిలోనూ భారత స్టార్ స్పిన్నర్, ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్..తన స్థానాన్ని మెరుగుపర్చుకున్నాడు. పైస్థానానికి ఎగబాకాడు. టెస్ట్ ఫార్మట్, ఆల్‌రౌండర్ కేటగిరి రెండింట్లోనూ అతను రెండో స్థానంలో నిలిచాడు. ఆల్ రౌండర్ కేటగిరిలో ఇదివరకు రెండో స్థానంలో రవీంద్ర జడేజా ఉండేవాడు. రవీంద్ర జడేజా స్థానాన్ని కొత్తగా రవిచంద్రన్ అశ్విన్ ఆక్రమించాడు.

క్రికెట్ క్యాలెండర్‌లో..

క్రికెట్ క్యాలెండర్‌లో..

రవిచంద్రన్ అశ్విన్.. క్రికెట్ క్యాలెండర్ ఇయర్‌లో ఓ అరుదైన రికార్డును అందుకున్నాడు. ఓ క్యాలెండర్ ఇయర్‌లో నాలుగుసార్లు 50కి పైగా వికెట్లను పడగొట్టిన బౌలర్‌‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ విషయంలో అతను టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లేను కూడా అధిగమించాడు. ఇదివరకు కుంబ్లే.. ఓ క్యాలెండర్ ఇయర్‌లో మూడుసార్లు 50కి పైగా వికెట్లను తీసుకున్నాడు. రవి అశ్విన్ అతణ్ని దాటేశాడు తన అద్భుత పెర్‌ఫార్మెన్స్‌తో.

న్యూజిలాండ్ సిరీస్..

న్యూజిలాండ్ సిరీస్..

ఇటీవలే న్యూజిలాండ్‌తో ముగిసిన రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఈ ముగ్గురూ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. రవిచంద్రన్ అశ్విన్.. 14 వికెట్లను పడగొట్టాడు. ఈ సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లను పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. అలాగే 70 పరుగులు చేశాడు. దీనితో బౌలింగ్‌లో అతని ర్యాంక్ మెరుగుపడింది. రెండో స్థానానికి ఎగబాకాడు. అంతకుముందు మూడో స్థానంలో ఉన్నాడు. అలాగే- ఆల్ రౌండర్ కేటగిరిలోనూ రవి అశ్విన్ రెండో స్థానంలో నిలిచాడు. ఇదివరకు ఈ స్థానంలో రవీంద్ర జడేజా ఉండేవాడు. ఇప్పుడతను నాలుగుకు దిగజారాడు.

సెంచరీ చేసిన మయాంక్.. ముందుకు

సెంచరీ చేసిన మయాంక్.. ముందుకు

న్యూజిలాండ్‌తో ముంబై వాంఖెడె స్టేడియంలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ర్యాంక్ మెరుగుపడింది. ర్యాంకింగ్స్ లిస్ట్‌లో ముందుకు దూసుకొచ్చాడు. ఈ టెస్ట్ సిరీస్ ఆరంభానికి ముందు అతని ర్యాంక్ 30. సిరీస్ ముగిసే సరికి 11వ స్థానానికి వచ్చాడు. వాంఖెడె టెస్టులో తొలి ఇన్నింగ్‌లో 150, రెండో ఇన్నింగ్‌లో 62 పరుగులు చేశాడు. దీనికి అతను 30 నుంచి 11వ స్థానానికి చేరుకున్నాడు. అతని కేరీర్ బెస్ట్ ర్యాంక్.. నంబర్ 10. ఒకే ఇన్నింగ్‌లో 10కి 10 వికెట్లు తీసుకున్న ఇజాజ్ పటేల్ 53వ స్థానం నుంచి 23కు చేరుకున్నాడు. ఇది అతని కేరీర్ బెస్ట్ ర్యాంక్.

టాప్‌లో విండీస్ పేసర్..

టాప్‌లో విండీస్ పేసర్..

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో వెస్టిండీస్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ అగ్రస్థానంలో నిలిచాడు. అతని పాయింట్లు 382. 360 పాయింట్లతో రెండో స్థానంలో రవి అశ్విన్ నిలిచాడు. బెన్ స్టోక్స్-348, రవీంద్ర జడేజా-436, షకీబుల్ హసన్-327 పాయింట్లతో తొలి అయిదు స్థానాలను ఆక్రమించుకున్నారు. కైలె జెమిసన్, పాట్ కమ్మిన్స్, క్రిస్‌ వోక్స్, కొలిన్ డీ గ్రాండ్‌హోమ్‌కు టాప్-10లో చోటు దక్కింది.

Story first published: Wednesday, December 8, 2021, 16:37 [IST]
Other articles published on Dec 8, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+