Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ICC Test Rankings: మూడు ఫార్మాట్లలో ‘టాప్’ లేపిన బాబర్ ఆజామ్.. బౌలింగ్లో బుమ్రా స్థానానికి ఎసరు..!

ICC Test Rankings: Pakistan Captain Babar Azam Achieved Top 3 Rank in All Formats

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ మరో అరుదైన ఘనత సాధించాడు. అన్ని ఫార్మాట్లలో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ 3లో ఉన్న ఏకైక బ్యాటర్‌గా నిలిచాడు. గాలేలో శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టులో సెంచరీతో బాబర్ కీలక ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. ఆ ఇన్నింగ్స్ వల్ల బాబర్ ఆజామ్.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను వెనక్కి నెట్టి ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నంబర్ 3స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం బాబర్ ఆజామ్ వన్డేలు, టీ20లలో నంబర్ 1 స్థానాల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక టెస్ట్ క్రికెట్‌లో తన కెరీర్‌లో అత్యుత్తమ రేటింగ్ పాయింట్లు 874సాధించిన ఆజామ్ 3వ స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లాండ్ స్టార్ జో రూట్ 923రేటింగ్ పాయింట్లతో నంబర్ 1 స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియాకు చెందిన మార్నస్ లబుషేన్ 885పాయింట్లతో 2వ స్థానంలో కొనసాగుతున్నాడు.

శ్రీలంకతో తొలి టెస్టు గెలుపులో కీలక పాత్ర ఇక తొలి టెస్టులో బాబర్ పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో దాదాపు 55శాతం పరుగులు చేయడం గమనార్హం. అతను 119పరుగులు చేయడంతో జట్టు స్కోరు 218కి చేరుకుంది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ స్కోరు 222కు దరిదాపులకు చేర్చడంలో బాబర్ తన బ్యాటింగ్ ద్వారా కీలక పాత్ర పోషించాడు. తొలి టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ బాబర్ హాఫ్ సెంచరీ చేయడంతో పాటు.. అబ్దుల్ షఫీక్ సెంచరీతో చెలరేగడంతో పాకిస్థాన్ 343పరుగుల రికార్డు ఛేజింగ్‌ను పూర్తి చేసింది. తద్వారా పాక్ 1-0తేడాతో సిరీస్లో ఆధిక్యాన్ని ప్రదర్శించింది. బాబర్ ఆజామ్ గతంలో తరచుగా ఆట యొక్క అన్ని ఫార్మాట్లలో తానే నం.1 బ్యాటర్ కావాలనే ఆశించేవాడు.

 అదే నా కల

అదే నా కల

'ఒక ఆటగాడిగా అన్ని ఫార్మాట్లలో నంబర్ 1గా నిలవడం నా కల. అందకు మీరు ఎంతో దృష్టి పెట్టాలి. కష్టపడి పనిచేయాలి, ఒకటి లేదా రెండు ఫార్మాట్లలో మీరు అగ్రశ్రేణి ఆటగాడిగా ఉంటే.. మూడో ఫార్మాట్లోనూ మీరు టాప్‌లోకి చేరుకోవచ్చు. మూడు ఫార్మాట్లలో నంబర్ 1 కావాలంటే మిమ్మల్ని మీరు మరింత ఫిట్‌గా ఉంచుకోవాలి. బ్యాక్ టు బ్యాక్ క్రికెట్ మ్యాచ్‌లు ఉంటూనే ఉంటాయి. మ్యాచ్‌ల మధ్య గ్యాప్ తక్కువగా ఉంటుంది. అందువల్ల అదనపు ఫిట్‌‌నెస్ సాధించాలి' అని బాబర్ ఆజామ్ ఇటీవల పేర్కొన్నాడు.

 టాప్ 10లో మనోళ్లు..

టాప్ 10లో మనోళ్లు..

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో ఇద్దరు భారత బ్యాటర్లున్నాయి. రిషబ్ పంత్ నెం.5 స్థానంలో ఉండగా.. భారత కెప్టెన్ రోహిత్ శర్మ 9వ స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ టాప్ 10నుంచి ఇటీవలే దిగజారి 12వ స్థానానికి చేరుకున్నాడు. ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది బౌలర్ల ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రాను వెనక్కి నెట్టి 3వ స్థానానికి చేరుకున్నాడు. గాలే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆఫ్రిది 4వికెట్లు పడగొట్టి సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఇక గాయం కారణంగా 2వ టెస్టుకు షాహిన్ దూరమయ్యాడు.

 ICC టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ (జూలై 27 నాటికి) టాప్ 5లో..

ICC టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ (జూలై 27 నాటికి) టాప్ 5లో..

1. జో రూట్ - 923 పాయింట్లు

2. మార్నస్ లబుషేన్ - 885 పాయింట్లు

3. బాబర్ ఆజామ్ - 874 పాయింట్లు

4. స్టీవ్ స్మిత్ - 848 పాయింట్లు

5. రిషబ్ పంత్ - 801 పాయింట్లు

 ICC టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ టాప్ 5లో..

ICC టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ టాప్ 5లో..

1. పాట్ కమిన్స్ - 891 పాయింట్లు

2. ఆర్ అశ్విన్ - 842 పాయింట్లు

3. షాహీన్ అఫ్రిది - 836 పాయింట్లు

4. జస్ప్రీత్ బుమ్రా - 828 పాయింట్లు

5. కగిసో రబడ - 818 పాయింట్లు

Story first published: Wednesday, July 27, 2022, 16:37 [IST]
Other articles published on Jul 27, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+