Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ICC Rankings: అగ్రస్థానంలో కుర్రాడు.. జో రూట్‌ను వెనక్కినెట్టి!

ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ రైజింగ్ స్టార్ హ్యారీ బ్రూక్ అగ్రస్థానానికి ఎగబాకాడు. తన సహచర ఆటగాడు జో రూట్‌ను వెనక్కినెట్టి వరల్డ్ నంబర్ వన్ టెస్టు బ్యాటర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్‌పై సెంచరీ బాది ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపాడు. రూట్ కంటే ఒక్క పాయింటు ఎక్కువ సాధించి టాపర్‌గా నిలిచాడు. రూట్‌కు 897 రేటింగ్ పాయింట్లు కాగా, 25 ఏళ్ల హ్యారీ బ్రూక్ 897 పాయింట్లతో కొనసాగుతున్నాడు.

ఈ ఏడాది జులైలో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ నుంచి జో రూట్ అగ్రస్థానాన్ని అందుకున్నాడు. తన కెరీర్‌లో ఇప్పటివరకు తొమ్మిది సార్లు నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగిన రూట్.. బ్రూక్ రాకతో రెండో స్థానానికి పడిపోయాడు. కాగా, అడిలైడ్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 140 పరుగులతో సత్తాచాటిన ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఆరు స్థానాలు ఎగబాకి అయిదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. శ్రీలంక‌తో జరిగిన రెండో టెస్టులో 78, 66 పరుగులతో సత్తాచాటిన దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా మూడు ర్యాంక్‌లు మెరుగుపర్చుకుని ఏడో స్థానంలో ఉన్నాడు.

ICC Test Batting Rankings New No 1 Emerges as Travis Head Reenters Top 10

మూడు, నాలుగు స్థానాల్లో కేన్ విలియమ్సన్, యశస్వీ జైస్వాల్ ఉన్నారు. టాప్-10లో భారత బ్యాటర్లలో జైస్వాల్‌తో పాటు రిషభ్ పంత్ ఉన్నాడు. మూడు స్థానాలు కోల్పోయి తొమ్మిదో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లి ఆరు స్థానాలు కోల్పోయి 20వ ర్యాంక్‌లో నిలిచాడు.పెర్త్ టెస్టులో అజేయ సెంచరీ చేసిన కోహ్లి అడిలైడ్ టెస్టులో 7, 11 పరుగులు చేశాడు. మరోవైపు బౌలింగ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

అడిలైడ్ టెస్టులో రాణించిన ప్యాట్ కమిన్స్ నాలుగో స్థానానికి, మిచెల్ స్టార్క్ 11వ స్థానానికి ఎగబాకారు. ఇక టెస్టు ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా తన అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ రెండు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు.

Story first published: Wednesday, December 11, 2024, 15:36 [IST]
Other articles published on Dec 11, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+