ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జో రూట్ మరోసారి నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోగా.. హ్యారీ బ్రూక్, కేన్ విలయమ్సన్, యశస్వి జైస్వాల్, స్టీవ్ స్మిత్ కూడా టాప్-5లో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఈ జాబితాలో మొదటిసారిగా ప్రవేశించారు. ఇటీవల అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన టాప్ ఐదు టెస్ట్ బ్యాటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. .
1.జో రూట్
ఇంగ్లండ్ అనుభవజ్ఞుడైన బ్యాటర్ జో రూట్ టెస్ట్ క్రికెట్‌లో తన స్థాయి వేరని మరోసారి నిరూపించుకున్నాడు. జో రూట్ 889 రేటింగ్ పాయింట్లతో ఐసీసీ ర్యాంకింగ్‌లో మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. 2024లో పాకిస్తాన్‌తో ముల్తాన్ టెస్ట్‌లో జో రూట్ అద్భుతంగా రాణించి టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానానికి చేరుకున్నాడు. జో రూట్ టెక్నిక్, అనుభవం తనను ప్రపంచ స్థాయి బ్యాటర్లలో ఒకరిగా నిలబెట్టాయి. ప్రస్తుతం జో రూట్ ఇంగ్లండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతున్నాడు.

2.హ్యారీ బ్రూక్
భారత్ తో ప్రస్తుతం జరుగుతున్న 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన చేస్తోన్న యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ తన స్థిరమైన, దూకుడైన ఆటతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. హ్యారీ బ్రూక్ 874 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి చేరుకున్నాడు. 2024లో వెల్లింగ్టన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్‌లో ఆయన అద్భుతమైన బ్యాటింగ్ హ్యారీ బ్రూక్‌ను ఈ స్థాయికి చేర్చింది. హ్యారీ బ్రూక్ ఇంగ్లండ్ టెస్ట్ బ్యాటింగ్‌కు కొత్త ఊపునిచ్చాడు.
3.కేన్ విలియమ్సన్
న్యూజిలాండ్ గొప్ప బ్యాటర్ కేన్ విలియమ్సన్ 867 రేటింగ్ పాయింట్లతో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్‌లో మూడో స్థానంలో ఉన్నాడు. 2021లో పాకిస్థాన్ జట్టుతో క్రైస్ట్‌చర్చ్ టెస్ట్‌లో 919 కెరీర్ బెస్ట్ రేటింగ్‌కు చేరుకున్న విలియమ్సన్ తన ప్రదర్శన ద్వారా నిరంతరం తనను తాను నిరూపించుకున్నాడు. ప్రశాంత స్వభావం, దృఢమైన టెక్నిక్ కేన్ విలియమ్సన్ అతిపెద్ద బలం.
4.యశస్వి జైస్వాల్
భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టిస్తూ, మొదటిసారిగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లోని టాప్-5లో ప్రవేశించాడు. యశస్వి జైస్వాల్ 851 రేటింగ్ పాయింట్లతో నాల్గవ స్థానంలో ఉన్నాడు. 2024లో ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ టెస్ట్‌లో ఆయన అద్భుతమైన ప్రదర్శన, 854 కెరీర్ హై రేటింగ్ జైస్వాల్‌కు ఈ స్థానాన్ని సంపాదించిపెట్టింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో యశస్వి జైస్వాల్ అద్భుతమైన సెంచరీ సాధించి తనను తాను నిరూపించుకున్నారు. భారత టెస్ట్ బ్యాటింగ్‌లో సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడగల ఆటగాడని జైస్వాల్ చూపించాడు.
5.స్టీవ్ స్మిత్
ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్ 816 రేటింగ్ పాయింట్లతో ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. స్టీవ్ స్మిత్ కెరీర్-హై రేటింగ్ 947గా ఉంది, ఇది 2018లో డర్బన్‌లో దక్షిణాఫ్రికాతో ఆడిన మ్యాచ్‌లో వచ్చింది. స్టీవ్ స్మిత్ రేటింగ్ ఇటీవల తగ్గినప్పటికీ, ఆయన టాప్-5లో నిలిచారు. స్టీవ్ స్మిత్ అనుభవం, స్థాయి ఆయనను నేటికీ ప్రపంచంలోని అత్యుత్తమ టెస్ట్ బ్యాటర్లలో ఒకరిగా నిలబెడుతుంది.