
టాప్ 10లో ఇద్దరు
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్లో గతంలో పోలిస్తే రోహిత్ శర్మ ఖాతాలో 8 రేటింగ్ పాయింట్లు తగ్గినప్పటికీ స్థానంలో ఎటువంటి మార్పు లేకుండా ఐదో ర్యాంకులోనే స్థిరంగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ ఖాతాలో 773 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టు మ్యాచ్లో రాణించిన విరాట్ కోహ్లీ ఖాతాలో మరో 27 రేటింగ్ పాయింట్ల చేరాయి. దీంతో మొత్తం 767 రేటింగ్ పాయింట్లతో 9వ స్థానం నుంచి విరాట్ కోహ్లీ 7వ స్థానానికి ఎగబాకాడు.

టాప్ 10లోకి బుమ్రా
ఇక బౌలర్ల జాబితాలో పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా సత్తా చాటాడు. టెస్టు ర్యాంకింగ్స్ జాబితాలో తన స్థానం మెరుగు పరచుకుని టాప్ 10లో పదో స్థానంలో నిలిచాడు. బుమ్రా ఖాతాలో 763 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇక వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో ఎటువంటి మార్పు లేదు. 839 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కానీ గతంలో పోలిస్తే 22 రేటింగ్ పాయింట్లు తగ్గాయి. బౌలర్ల జాబితాలో టాప్ 10లో అశ్విన్, బుమ్రా ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఇక వన్డే బౌలర్ల జాబితాలో 679 రేటింగ్ పాయింట్లతో జస్ప్రీత్ బుమ్రా ఏడో స్థానంలో ఉన్నాడు. వన్డే ర్యాంకింగ్స్ బౌలర్ల జాబితాలో టాప్ 10లో భారత్ నుంచి బుమ్రా మాత్రమే ఉన్నాడు.
|
టాప్ ప్లేసులో ఎవరంటే
ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ నంబర్ వన్ ప్లేసులో కొనసాగుతున్నాడు. అతని ఖాతాలో 935 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇక జో రూట్, కేన్ విలియమ్సన్, స్టీవెన్ స్మిత్ రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. రూట్ ఖాతాలో 872, విలియమ్సన్ ఖాతాలో 862, స్మిత్ ఖాతాలో 845 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇక బౌలర్ల జాబితాలో నంబర్ వన్ ప్లేసులో ఉన్న ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ జాబితో 898 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. మూడో స్థానంలో రబాడ, నాలుగులో జేమీషన్, ఐదులో షాహీన్ ఆఫ్రీదీ ఉన్నారు.

వన్డేల్లో టాప్ ఎవరంటే
ఇక వన్డే బౌలర్ల జాబితాలో టాప్ ప్లేసులో ఉన్న న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ జాబితాలో 737 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇక రెండో స్థానంలో హెజీల్ వుడ్, మూడో స్థానంలో రహమాన్, నాలుగో స్థానంలో క్రిస్ వోక్స్, ఐదో స్థానంలో హాసన్ మిరజ్ ఉన్నారు.