ICC T20I rankings: ముంబై ఇన్నింగ్స్ ఫలితం టాప్-10లోకి కోహ్లీ

హైదరాబాద్: ఐసీసీ గురువారం ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. ముంబైలో బుధవారం వెస్టిండిస్‌తో జరిగిన ఆఖరి టీ20లో కోహ్లీ 29 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సుల సాయంతో 70 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఈ ఇన్నింగ్స్ ఫలితంగా గురువారం ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో ఐదు స్థానాలు ఎగబాకి టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. మరోవైపు ఆఖరి టీ20లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న ఓపెనర్ కేఎల్ రాహుల్ 3 స్థానాలు ఎగబాకి ఆరో స్థానంలో నిలిచాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ ఒక స్థానం కోల్పోయి 9వ స్థానంలో నిలిచాడు.

కోహ్లీకి ఇది మరోక సంచలనాత్మక సంవత్సరం
విరాట్ కోహ్లీకి ఇది మరోక సంచలనాత్మక సంవత్సరం కానుంది. ఇప్పటికే వన్డే, టెస్ట్ బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న కోహ్లీ వరుసగా నాలుగో ఏడాది కూడా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచే అరుదైన అవకాశం లభించింది. మూడు ఫార్మాట్లలో 50కిపైగా యావరేజి ఉన్న ఏకైక ఆటగాడు కోహ్లీనే.

రోహిత్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో
ఇప్పటివరకు 84 టెస్టులాడిన కోహ్లీ 54.97 యావరేజితో 7202 పరుగులు చేశాడు. 239 వన్డేల్లో 60.30 యావరేజితో 11520 పరుగులు నమోదు చేశాడు. 75 టీ20ల్లో 52.66 యావరేజితో 2633 పరుగులు చేశాడు. ఫలితంగా టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మతో కలిసి విరాట్ కోహ్లీ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు.

కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డు
హైదరాబాద్ టీ20లో 94 పరుగులతో అజేయంగా నిలిచిన కోహ్లీ.... తిరువనంతపురం వేదికగా జరిగిన రెండో టీ20లో 19 పరుగులతో నిరాశపరిచిన సంగతి తెలిసిందే. అయితే, సిరిస్ నెగ్గాలంటే తప్పక గెలవాల్సిన ఆఖరి టీ20లో కోహ్లీ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 29 బంతుల్లో 70 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో వెస్టిండిస్‌తో ముగిసిన మూడు టీ20ల సిరిస్‌లో విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డు లభించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications