న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ICC T20I Rankings: కేఎల్ రాహుల్ 6... కెప్టెన్ కోహ్లీ 9

ICC T20I Rankings: Shikhar Dhawan breaks into Top 15; Navdeep Saini and Lakshan Sandakan make notable gains

హైదరాబాద్: శుక్రవారంతో శ్రీలంకతో ముగిసిన మూడు టీ20ల సిరిస్‌ను కోహ్లీసేన 2-0తో కైవసం చేసుకుని ఈ ఏడాది తొలి సిరిస్‌ను సొంతం చేసుకుంది. ఈ సిరిస్ అనంతరం 2020లో ఐసీసీ తొలి టీ20 ర్యాంకింగ్స్‌ను శనివారం విడుదల చేసింది. దీంతో ఈ సిరిస్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన భారత క్రికెటర్లు తమ స్థానాలను మరింతగా మెరుగుపరచుకున్నారు.

ఈ సిరిస్‌లో రాణించిన టీమిండియా ఓపనర్ కేఎల్ రాహుల్ అదనంగా 26 పాయింట్లు పొంది మొత్తం 760 రేటింగ్ పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచాడు. మరోవైపు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, శిఖర్ థావన్ కూడా తమ ర్యాంకులను మెరుగు పరుచుకున్నారు. 683 రేటింగ్ పాయింట్లతో కోహ్లీ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని 9వ స్థానంలో నిలిచాడు.

2-0తో సిరిస్ ఓటమికి కారణాలు వెల్లడించిన లసిత్ మలింగ2-0తో సిరిస్ ఓటమికి కారణాలు వెల్లడించిన లసిత్ మలింగ

పూణె వేదికగా శుక్రవారం జరిగిన మూడో టీ20లో హాఫ్ సెంచరీ సాధించిన ఓపెనర్ శిఖర్ ధావన్(52) ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని 15వ స్థానానికి ఎగబాకాడు. ఇక, పాకిస్థాన్ ఆటగాడు బాబర్ అజమ్ 879 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.... ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ 810 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.

ఈ సిరీస్‌లో మ్యాన్‌ ఆప్‌ ద సిరీస్‌ అవార్డు గెలుచుకున్న టీమిండియా పేసర్‌ నవదీప్‌ సైనీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌-100లోకి దూసుకొచ్చాడు. ఈ సిరీస్‌లో సైనీ ఐదు వికెట్లు సాధించాడు. తొలి టీ20లో రెండు వికెట్లు సాధించిన సైనీ, రెండో టీ20లో మూడు వికెట్లు పడగొట్టాడు.

ఫలితంగా ఒక్కసారిగా టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 146 స్థానాలు ఎగబాకి 98వ స్థానానికి చేరుకున్నాడు. మరొక బౌలర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ 92వ స్థానంలో నిలిచాడు. ఈ సిరీస్‌లో ఐదు వికెట్లు సాధించడమే కాకుండా మూడో టీ20లో 8 బంతుల్లో 22 పరుగులు చేశాడు.

Story first published: Saturday, January 11, 2020, 17:14 [IST]
Other articles published on Jan 11, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X