For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ICC T20 world cup 2022: దాయాదుల పోరు...పాక్‌ను చిత్తు చేసేందుకు టీమిండియా రెఢీ..!

ICC T20 world cup 2022 live updates in telugu:Get minute to minute action from this mega tournament

కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తూ వస్తోన్న బిగ్ డే వచ్చేసింది. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య ఇంకొన్ని గంటల్లో మ్యాచ్ ఆరంభం కాబోతోంది. దీనికోసం రెండు జట్లూ సన్నద్ధం అయ్యాయి. ఈ ప్రిస్టేజియస్ టోర్నమెంట్‌లో ఇదే బిగ్గెస్ట్ ఫైట్. ఈ మ్యాచ్‌కు ఉన్నంత క్రేజ్ మరే దానికీ ఉండట్లేదు. దీన్ని ప్రత్యక్షంగా చూడటానికి ప్రేక్షకులు ఎదురు చూస్తోన్నారు.

ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా లక్ష మందికి పైగా ప్రేక్షకులకు వీక్షించడానికి సన్నద్ధం అయ్యారు. ఇదో రికార్డు.మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. భారత్ పాక్ మ్యాచ్‌కు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం

Nov 04, 2022, 9:16 am IST

టీ20 ప్రపంచకప్ 2022 సూపర్ 12లో భాగంగా ఇవ్వాళ అడిలైడ్ ఓవల్‌లో న్యూజిలాండ్- ఐర్లాండ్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.

Nov 02, 2022, 8:45 am IST

ఇంకాస్సేపట్లో జింబాబ్వే-నెదర్లాండ్స్ మ్యాచ్ ఆరంభం కానుంది. అడిలైడ్ ఓవల్ దీనికి వేదిక. ఇదే పిచ్‌పై భారత్.. బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఈ మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.

Nov 02, 2022, 6:35 am IST

టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో భాగంగా భారత్ ఇవ్వాళ బంగ్లాదేశ్‌తో తలపడనుంది.

Oct 30, 2022, 8:33 am IST

జింబాబ్వేతో తలపడుతున్న బంగ్లాదేశ్ తుదిజట్టులో సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, లిట్టన్ దాస్, షకీబుల్ హసన్, హఫీఫ్ హొస్సేన్, యాసిర్ అలీ, నూరుల్ హసన్ (వికెట్ కీపర్), మొసాద్దిక్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, మహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఉన్నారు.

Oct 30, 2022, 8:29 am IST

టీ20 ప్రపంచకప్ సూపర్ 12లో భాగంగా బ్రిస్బేన్ గబ్బా స్టేడియంలో జింబాబ్వే.. బంగ్లాదేశ్‌ను ఢీ కొడుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.

Oct 30, 2022, 7:28 am IST

టీ20 ప్రపంచకప్ సూపర్ 12లో భాగంగా ఇవ్వాళ మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందులో ఒకటి బ్రిస్బేన్, మరో రెండు పెర్త్‌లో షెడ్యూల్ అయ్యాయి.

Oct 29, 2022, 2:41 pm IST

శ్రీలంకపై హాఫ్ సెంచరీ గ్లెన్ ఫిలిప్స్. 39 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన ఫిలిప్స్.

Oct 29, 2022, 2:19 pm IST

గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిఛెల్ క్రీజ్‌లో ఉన్నారు. శ్రీలంక బౌలర్లలో మహీష్ తీక్షణ, కసున్ రజిత, ధనంజయ డిసిల్వ ఒక్కో వికెట్ పడగొట్టారు.

Oct 29, 2022, 2:11 pm IST

ఓపెనర్లు ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే ఒకటి చొప్పున పరుగులు చేశారు. వన్ డౌన్ బ్యాటర్, కేప్టెన్ కేన్ విలియమ్సన్ ఎనిమిది పరుగులు చేసిన అవుట్ అయ్యారు.

Oct 29, 2022, 2:05 pm IST

న్యూజిలాండ్‌పై నిప్పులు చెరుగుతున్న శ్రీలంక బౌలర్లు. 7 ఓవర్లల్లో 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన కివీస్.

Oct 29, 2022, 1:10 pm IST

టీ20 ప్రపంచకప్ సూపర్ 12లో భాగంగా న్యూజిలాండ్-శ్రీలంక తలపడనున్నాయి. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ దీనికి వేదిక. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది.

Oct 29, 2022, 6:52 am IST

టీ20 ప్రపంచకప్ సూపర్ 12లో ఇవ్వాళ ఒక్కటే మ్యాచ్ షెడ్యూల్ అయింది. న్యూజిలాండ్-శ్రీలంక తలపడనున్నాయి. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ దీనికి వేదిక. ఈ మధ్యాహ్నం 1:30 మ్యాచ్ మొదలవుతుంది.

Oct 28, 2022, 3:42 pm IST

టీ20 ప్రపంచకప్ సూపర్ 12లో భాగంగా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్‌లో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయినట్లు అంపైర్లు ప్రకటించారు.

Oct 28, 2022, 1:20 pm IST

టీ20 ప్రపంచకప్ సూపర్ 12లో భాగంగా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్‌లో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల ఆలస్యమైంది. టాస్ కూడా పడలేదు.

Oct 28, 2022, 11:36 am IST

టీ20 ప్రపంచకప్ 2022 సూపర్ 12లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్-ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది.

Oct 28, 2022, 10:56 am IST

ఆఫ్ఘనిస్తాన్-ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల ఆలస్యమైంది. టాస్ కూడా పడలేదు.

Oct 28, 2022, 6:52 am IST

రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ తలపడనున్నాయి. మెల్‌బోర్న్‌లోనే ఈ మ్యాచ్ కూడా షెడ్యూల్ అయింది. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది.

Oct 28, 2022, 6:38 am IST

తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్-ఐర్లాండ్ తలపడనున్నాయి. మెల్‌బోర్న్ దీనికి వేదిక. ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది.

Oct 28, 2022, 6:25 am IST

టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఇవ్వాళ రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి.

Oct 28, 2022, 6:12 am IST

టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్‌పై జింబాబ్వే ఘన విజయాన్ని సాధించడం పట్ల స్పందించిన ఆ దేశాధ్యక్షుడు ఎమర్సన్ డాంబుడ్జో ఎంనంగగ్వా. నెక్స్ట్ టైమ్ అసలైన మిస్టర్ బీన్‌ను పంపించాలంటూ పాకిస్తాన్‌కు చురకలు

Oct 27, 2022, 3:16 pm IST

కేఎల్ రాహుల్ మరోసారి విఫలం అయ్యాడు. తొమ్మిది పరుగులకే అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ-53, విరాట్ కోహ్లీ-62, సూర్యకుమార్ యాదవ్-51 పరుగులు చేశారు. నెదర్లాండ్స్‌కు 180 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.

Oct 27, 2022, 3:05 pm IST

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా. నిర్ణీత 20 ఓవర్లల్లో రెండు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.

Oct 27, 2022, 2:25 pm IST

టీ20 ప్రపంచకప్ 2022 సూపర్ 12లో రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో ఆడుతున్న టీమిండియా.

Oct 23, 2022, 7:22 pm IST

విరాట్ కోహ్లీ మా విజయాన్ని లాగేసాడు: బాబర్ ఆజామ్

మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. క్రెడిట్ అంతా విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాలదే. అసాధారణమైన బ్యాటింగ్‌తో మా ఓటమిని శాసించారు. కొత్త బంతితో బ్యాటింగ్ అంత సులువు కాదు. మేం కూడా 10 ఓవర్ల తర్వాతనే భాగస్వామ్యాలు అందుకున్నాం. విజయానికి మాకు మంచి అవకాశం లభించింది. మేం మా ప్రణాళికలకు తగ్గట్లు ఆడాం. కానీ విరాట్ కోహ్లీ ఒంటి చేత్తో మ్యాచ్‌ను మా నుంచి లాగేసుకున్నాడు. మిడిల్ ఓవర్లలో వికెట్ తీయాలనే స్పిన్నర్ షాదాబ్‌ను ఆఖరి ఓవర్‌కు ఆపాను. ఈ మ్యాచ్‌లో ఓడినా చాలా సానుకూలంశాలు లభించాయి. ఇఫ్తికర్ అహ్మద్, షాన్ అద్భుతంగా ఆడారు'

Oct 23, 2022, 6:17 pm IST

ఉత్కంఠ పోరులో టీమిండియా విజయం

టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియా శుభారంభం చేసింది. ఉత్కంఠకే ఊపిరి అందని మ్యాచ్‌లో అద్భుత విజయాన్నందుకుంది. పాకిస్థాన్‌తో ఆదివారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82 నాటౌట్) విరోచిత పోరాటంతో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా నడిచిన జట్టును తనదైన బ్యాటింగ్‌తో విజయం వైపు నడిపించాడు. ఆఖరి ఓవర్‌లో హైడ్రామా చోటు చేసుకున్న విరాట్ తన అనుభవంతో విజయం ముంగిట నిలబెట్టాడు.

Oct 23, 2022, 4:13 pm IST

నాలుగో వికెట్ కోల్పోయిన భారత్

రనౌ‌ట్‌గా వెనుదిరిగిన అక్షర్ పటేల్(2)

Oct 23, 2022, 4:07 pm IST

మూడో వికెట్ కోల్పోయిన భారత్

దూకుడు కనబర్చిన సూర్యకుమార్ యాదవ్(15) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

Oct 23, 2022, 4:02 pm IST

రెండు వికెట్లు కోల్పోయిన భారత్

భారత ఓపెనర్లు కేఎల్ రాహుల్(4), రోహిత్(4) దారుణంగా విఫలమయ్యారు

Oct 23, 2022, 3:34 pm IST

అర్ష్‌దీప్, హార్దిక్ తీన్మార్.. పాక్ బ్యాటింగ్ బేజార్! రోహిత్ సేన ముందు లడ్డూ లాంటి టార్గెట్!

పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న భారత బౌలర్లు పాక్ బ్యాటర్లను వణికించారు. సూపర్ బౌలింగ్‌తో ఆ జట్టును 160 పరుగులు సాధారణ లక్ష్యానికే పరిమితం చేశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. షాన్ మసూద్(42 బంతుల్లో 5 ఫోర్లతో 52 నాటౌట్), ఇఫ్తికర్ అహ్మద్(34 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీలతో పాక్‌ను ఆదుకున్నారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా మూడేసి వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ తలో వికెట్ తీసారు. పాక్‌లో వరల్డ్ క్లాస్ పేసర్లు ఉన్న నేపథ్యంలో భారత ఆటగాళ్లు ఆచితూచి ఆడాల్సిన అవసరం ఉంది.

Oct 23, 2022, 3:13 pm IST

షాన్ మసూద్ (40 బంతుల్లో 50) హాఫ్ సెంచరీ

Oct 23, 2022, 2:38 pm IST

మూడో వికెట్ కోల్పోయిన పాకిస్థాన్

మహమ్మద్ షమీ బౌలింగ్‌లో ఇఫ్తికర్ అహ్మద్(51) మూడో వికెట్‌గా వెనుదిరిగాడు.

Oct 23, 2022, 2:35 pm IST

ఇఫ్తికర్ అహ్మద్(32 బంతుల్లో 51) హాఫ్ సెంచరీ

Oct 23, 2022, 2:28 pm IST

10 ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ 60/2

Oct 23, 2022, 1:54 pm IST

రెండో వికెట్ కోల్పోయిన పాకిస్థాన్

డేంజరస్ మహమ్మద్ రిజ్వాన్(4)ను అర్ష్‌దీప్ సింగ్ పెవిలియన్ చేర్చాడు

Oct 23, 2022, 1:53 pm IST

బచాయించిన రిజ్వాన్

క్యాచ్ చేజార్చిన విరాట్ కోహ్లీ

Oct 23, 2022, 1:49 pm IST

చెలరేగుతున్న భారత బౌలర్లు..3 ఓవర్లలో పాక్ స్కోర్ 10/1

Oct 23, 2022, 1:45 pm IST

బచాయించిన పాక్ బ్యాటర్ మసూద్

అర్ష్‌దీప్ సింగ్ వేసిన రెండో ఓవర్‌లో షాన్ మసూద్ రనౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

Oct 23, 2022, 1:44 pm IST

తొలి వికెట్ కోల్పోయిన పాకిస్థాన్

అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగిన బాబర్ ఆజామ్(0)

Oct 23, 2022, 1:38 pm IST

దినేశ్ కార్తీక్ స్టన్నింగ్ కీపింగ్.. నాలుగు పరుగులు సేవ్

Oct 23, 2022, 1:36 pm IST

భువీ సూపర్ బౌలింగ్..

భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన బౌలింగ్.. పాకిస్థాన్‌కు ఒకే ఒక పరుగు

Oct 23, 2022, 1:26 pm IST

యుజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్‌కు దక్కని చోటు

పిచ్ కండిషన్స్, ప్రత్యర్థి జట్టులోని ఉన్న ఆటగాళ్లకు తగ్గట్లు తుది జట్టును ఎంపిక చేశామని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. పాక్ లెఫ్టాండర్స్‌ను కట్టడి చేసేందుకు అశ్విన్ తీసుకున్నామని తెలిపాడు.

Oct 23, 2022, 1:24 pm IST

పాకిస్థాన్ తుది జట్టు

బాబర్ ఆజామ్(కెప్టెన్), మహమ్మద్ రిజ్వాన్(కీపర్), షాన్ మసూద్, హైదర్ అలీ, మహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, అసిఫ్ అలీ,షాహిన్ అఫ్రిది, హారీస్ రౌఫ్, నసీమ్ షా

Oct 23, 2022, 1:23 pm IST

భారత తుది జట్టు

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, దినేశ్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్

Oct 23, 2022, 1:03 pm IST

భారత్‌దే టాస్..

పాకిస్థాన్‌తో బిగ్ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

Oct 23, 2022, 10:50 am IST

భారత్ Xపాక్ మ్యాచ్ జరిగే మెల్‌బోర్న్ మైదానం ముందు అభిమానుల సందడి

Oct 23, 2022, 10:48 am IST

సూర్యతో బ్యాటింగ్ భలే ఉంటుంది..

సూర్యకుమార్ యాదవ్‌తో బ్యాటింగ్ భలే ఉంటుందని విరాట్ కోహ్లీ చెప్పాడు. ‘క్రీజులో నువ్వుండన్నా.. నేను చెలరేగుతాను’అని చెబుతాడని దాంతో తాను యాంకర్ రోల్ పోషించాల్సి వస్తుందని పేర్కొన్నాడు.

Oct 23, 2022, 10:46 am IST

టీమిండియా క్రేజ్ అంటే ఇదే..

టీమిండియా ప్రాక్టీస్ సెషన్ చూసేందుకు ఎగబడ్డ వందల మంది ఫ్యాన్స్.

Oct 23, 2022, 9:51 am IST

పాకిస్థాన్ తుది జట్టు అంచనా

మహమ్మద్ రిజ్వాన్(కీపర్), బాబర్ ఆజామ్(కెప్టెన్), మసూద్, హైదర్ అలీ, ఇఫ్తికర్, ఆసిఫ్ అలీ, నవాజ్, షాదాబ్ ఖాన్,నసీమ్ షా, షాహీన్, హారిస్ రౌఫ్

Oct 23, 2022, 9:49 am IST

భారత తుది జట్టు(అంచనా)

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, దినేశ్ కార్తీక్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్/అశ్విన్

Oct 23, 2022, 9:13 am IST

ఆసియా కప్ ఓటమికి బదులు తీర్చుకోవాలన్న కసితో బరిలోకి దిగుతోన్న టీమిండియా

Oct 23, 2022, 9:13 am IST

మెల్‌బోర్న్ వేదికగా దాయాదుల పోరు..పాక్‌ను చిత్తు చేసేందుకు రోహిత్ సేన సిద్ధం

Oct 23, 2022, 9:12 am IST

మరి కొన్ని గంటల్లో భారత్ పాక్ మ్యాచ్

Oct 19, 2022, 8:47 am IST

టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశలో ఐర్లాండ్-స్కాట్లాండ్ మధ్య ఇంకాస్సేపట్లో మ్యాచ్ ఆరంభం కానుంది. 9 గంటలకు టాస్ పడనుంది. 9:30 మ్యాచ్ మొదలవుతుంది.

Oct 19, 2022, 7:16 am IST

టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఇవ్వాళ అయిదు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందులో రెండు గ్రూప్ దశ, మిగిలిన మూడు వామప్స్ ఉన్నాయి.

Oct 17, 2022, 1:39 pm IST

తొలి వామప్‌లో గెలిచిన భారత్. ఎల్లుండి రెండో వామప్‌లో న్యూజిలాండ్‌తో తలపడనున్న టీమిండియా.

Oct 17, 2022, 12:59 pm IST

భారత్‌పై వామప్ మ్యాచ్‌లో తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా. చివరి ఓవర్‌లో నేలకూలిన మూడు వికెట్లు.

Oct 17, 2022, 12:57 pm IST

భారత్‌పై వామప్ మ్యాచ్‌లో ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా. ఆస్గర్ రనౌట్. ఆస్ట్రేలియా గెలవడానికి 2 బంతుల్లో 7 పరుగులు అవసరం.

Oct 17, 2022, 12:56 pm IST

భారత్‌పై వామప్ మ్యాచ్‌లో ఏడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా. పాట్ కమ్మిన్స్ అవుట్. ఆస్ట్రేలియా గెలవడానికి 3 బంతుల్లో ఏడు పరుగులు అవసరం.

Oct 17, 2022, 12:51 pm IST

ఆస్ట్రేలియా గెలవడానికి 7 బంతుల్లో 12 పరుగులు అవసరం.

Oct 17, 2022, 12:50 pm IST

భారత్‌పై వామప్ మ్యాచ్‌లో ఆరో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా. టిమ్ డేవిడ్ రనౌట్. విరాట్ కోహ్లీ విసిరిన డైరెక్ట్ హిట్‌కు గాల్లోకి లేచిన బెయిల్స్.

Oct 17, 2022, 12:47 pm IST

భారత్‌పై వామప్ మ్యాచ్‌లో అయిదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఆరోన్ ఫించ్ అవుట్. 79 పరుగులు చేసిన ఫించ్. గెలవడానికి ఆస్ట్రేలియాకు 11 బంతుల్లో 16 పరుగులు అవసరం.

Oct 17, 2022, 12:43 pm IST

భారత్‌పై వామప్ మ్యాచ్‌లో నాలుగో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో మార్కస్ స్టొయినిస్ అవుట్. గెలవడానికి ఆస్ట్రేలియాకు 13 బంతుల్లో 20 పరుగులు అవసరం.

Oct 17, 2022, 12:37 pm IST

భారత్‌పై వామప్ మ్యాచ్‌లో మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా. 16 బంతుల్లో 23 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్. భవనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ దినేష్ కుమార్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్.

Oct 17, 2022, 12:11 pm IST

భారత్‌పై వామప్ మ్యాచ్‌లో ఓపెనర్ మిఛెల్ మార్ష్-35, స్టీవెన్ స్మిత్-11 పరుగులు చేసి అవుట్ అయ్యారు. క్రీజ్‌లో ఆరోన్ ఫించ్-45, గ్లెన్ మ్యాక్స్‌వెల్-1 ఉన్నారు.

Oct 17, 2022, 12:09 pm IST

భారత్‌పై వామప్ మ్యాచ్‌లో 11 ఓవర్లల్లో రెండు వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసిన ఆస్ట్రేలియా.

Oct 17, 2022, 12:08 pm IST

186 పరుగుల లక్ష్య ఛేదన దిశగా ఆస్ట్రేలియా.

Oct 17, 2022, 10:57 am IST

ఆస్ట్రేలియాపై వామప్ మ్యాచ్‌లో అయిదో వికెట్ కోల్పోయిన భారత్. 20 పరుగులు చేసి దినేష్ కార్తీక్ అవుట్.

Oct 17, 2022, 10:36 am IST

ఆస్ట్రేలియాపై వామప్ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా అవుట్.

Oct 17, 2022, 10:17 am IST

వామప్ మ్యాచ్‌లో వెంటవెంటనే రెండు వికెట్లను కోల్పోయిన భారత్. ఓపెనర్లు రోహిత్ శర్మ-15, కేఎల్ రాహుల్-57 పరుగులు చేసిన అవుట్ అయ్యారు.

Oct 17, 2022, 10:03 am IST

వామప్ మ్యాచ్‌లో చెలరేగుతున్న కేఎల్ రాహుల్. 27 బంతుల్లో హాఫ్ సెంచరీ. ఇందులో మూడు సిక్సర్లు, ఆరు ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం 55 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు కేఎల్.

Oct 17, 2022, 9:22 am IST

ఆస్ట్రేలియాతో అఫీషియల్ వామప్ మ్యాచ్ ఆడనున్న టీమిండియా. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియం దీనికి వేదిక. టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్ కేప్టెన్ ఆరోన్ ఫించ్.

Oct 17, 2022, 9:18 am IST

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా హోబర్ట్‌లో ఐర్లాండ్‌తో గ్రూప్ మ్యాచ్ ఆడనున్న విండీస్. 9:30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుందీ మ్యాచ్.

Oct 17, 2022, 9:06 am IST

టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా వెస్టిండీస్-ఐర్లాండ్ మధ్య మ్యాచ్ షెడ్యూల్ అయింది. 9:30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.

Oct 16, 2022, 3:17 pm IST

టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో తొలి మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించిన నమీబియాపై ప్రశంసల వర్షాన్ని కురిపించారు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.

Oct 16, 2022, 2:52 pm IST

టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో తొలి మ్యాచ్‌లో శ్రీలంకను మట్టి కరిపించిన నమీబియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ సైతం ఆ జట్టును ప్రశంసించారు.

Oct 16, 2022, 1:29 pm IST

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తరఫున ఆడుతోన్న ఆయాన్ ఖాన్ వయస్సు 16 సంవత్సరాలే. టీ20 ప్రపంచకప్‌లో ఆడుతున్న యంగెస్ట్ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పిన ఆయాన్ ఖాన్.

Oct 16, 2022, 1:23 pm IST

టీ20 ప్రపంచకప్ గ్రూప్స్ రెండో మ్యాచ్‌లో టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. నెదర్లాండ్స్‌ ఫీల్డింగ్‌కు దిగనుంది.

Oct 16, 2022, 1:22 pm IST

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన జాన్ ఫ్రైలింక్. బ్యాటింగ్‌లో 28 బంతుల్లో 44 పరుగులు చేసిన ఫ్రైలింక్. బౌలింగ్‌లో నాలుగు ఓవర్లల్లో 26 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్న ఫ్రైలింక్.

Oct 16, 2022, 12:52 pm IST

నమీబియా చేతిలో ఓడిపోయిన శ్రీలంక. తొలి మ్యాచ్‌లో నమీబియా ఘన విజయం. 18.6 ఓవర్లల్లో 108 పరుగులకు శ్రీలంక ఆలౌట్.

Oct 16, 2022, 12:40 pm IST

తొమ్మిదో వికెట్ కోల్పోయిన శ్రీలంక. 92 పరుగులకు తొమ్మిది వికెట్లు కోల్పోయిన లంకేయులు.

Oct 16, 2022, 12:36 pm IST

ఎనిమిది వికెట్లను కోల్పోయిన శ్రీలంక. 90 పరుగులకు ఎనిమిది వికెట్లను కోల్పోయిన లంకేయులు.

Oct 16, 2022, 12:31 pm IST

ఏడు వికెట్లను కోల్పోయిన శ్రీలంక. 14 ఓవర్లల్లో 88 పరుగులుకు ఏడు వికెట్లను కోల్పోయిన లంకేయులు.

Oct 16, 2022, 12:26 pm IST

ఓటమి దిశగా శ్రీలంక. 12.3 ఓవర్లల్లో 80 పరుగులకు ఆరు వికెట్లను కోల్పోయిన లంకేయులు.

Oct 16, 2022, 11:46 am IST

ఓపెనర్లు పాథుమ్ నిశ్శంక-9, కుశాల్ మెండిస్-6 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ధనుష్క గుణతిలకది గోల్డెన్ డక్. ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరిగిన ధనుష్క.

Oct 16, 2022, 11:44 am IST

కుప్పకూలుతున్న శ్రీలంక బ్యాటింగ్. నాలుగు ఓవర్లలో 23 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయిన లంకేయులు.

Oct 16, 2022, 11:12 am IST

నిర్ణీత 20 ఓవర్లల్లో నమీబియా ఏడు వికెట్లను కోల్పోయి 163 పరుగులు చేసింది. శ్రీలంక ముందు 164 పరుగుల లక్ష్యాన్నిఉంచింది. చివరి అయిదు ఓవర్లల్లో నమీబియా బ్యాటర్లు 68 పరుగులు పిండుకున్నారు.

Oct 16, 2022, 11:11 am IST

జన్ ఫ్రైలింక్ 28 బంతులలో నాలుగు ఫోర్లతో 44, జేజే స్మిత్ 16 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 31 పరుగులు చేశారు.

Oct 16, 2022, 11:10 am IST

శ్రీలంక బౌలర్లపై నమీబియా బ్యాటర్ల ఎదురుదాడి. చివర్లో చెలరేగిన లోయర్ ఆర్డర్ బ్యాటర్లు జన్ ఫ్రైలింక్, జేజే స్మిత్.

Oct 16, 2022, 10:17 am IST

చెలరేగుతున్న శ్రీలంక బౌలర్లు. లంకేయుల దెబ్బకు మూడు వికెట్లను కోల్పోయిన నమీబియా. 10 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లను కోల్పోయి 59 పరుగులు చేసింది.

Oct 16, 2022, 9:41 am IST

బ్యాటింగ్ ఆరంభించిన నమీబియా. రెండో ఓవర్‌లోనే వికెట్‌ను కోల్పోయింది. చమీర బౌలింగ్‌లో మూడు పరుగులు చేసిన మైఖెల్ లింగెన్ వాన్ అవుట్ అయ్యాడు. ఆరు పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది.

Oct 16, 2022, 9:29 am IST

శ్రీలంక జట్టు ప్లేయింగ్ 11లో పాథుమ్ నిశ్శంక, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), ధనంజయ డిసిల్వా, గుణతిలక, భానుక రాజపక్స, డాసన్ షనక (కెప్టెన్), వనిందు హసరంగ, చమిర కరుణరత్నే, చమీర, ప్రమోద్ మదుషన్, మహీష్ తీక్షణ ఉన్నారు.

Oct 16, 2022, 9:13 am IST

శ్రీలంకకు బిగ్ షాక్ తగిలింది. లెఫ్ట్ ఆర్మ్ సీమ్ బౌలర్ మధుషనక గాయ పడ్డాడు. గాయం కారణంగా అతను టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ నుంచి వైదొలగే అవకాశం ఉంది. గాయం తీవ్రతను పరిశీలించిన అనంతరం శ్రీలంక క్రికెట్ బోర్డు దీనిపై అధికారిక ప్రకటన చేయనుంది.

Oct 16, 2022, 9:06 am IST

టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌ గ్రూప్ దశ తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక. తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న కేప్టెన్ డాసన్ శనక.

Oct 16, 2022, 8:51 am IST

ఇంకొద్ది క్షణాల్లో టీ20 ప్రపంచకప్ 2022 గ్రూప్ దశ తొలి మ్యాచ్‌కు టాస్ పడనుంది. ఉదయం 9 గంటలకు టాస్, 9:30 మ్యాచ్ మొదలవుతుంది.

Oct 16, 2022, 8:44 am IST

ప్రస్తుతం అందరి దృష్టీ రోహిత్ శర్మ మీదే నిలిచింది. ఓ టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఆడబోయే భారత జట్టుకు నాయకత్వాన్ని వహించడం హిట్ మ్యాన్‌కు ఇదే తొలిసారి.

Oct 16, 2022, 8:28 am IST

న్యూజిలాండ్‌తో భారత్ ఆడబోయే రెండో వామప్.. ఈ నెల 19వ తేదీన ఉంటుంది. ఇదే గబ్బా స్టేడియంలో మ్యాచ్‌ కొనసాగుతుంది.

Oct 16, 2022, 8:02 am IST

టీ20 ప్రపంచకప్ తొలి అధికారిక వామప్ తొలి మ్యాచ్ సోమవారం ఉదయం 9:30 గంటలకు ఆరంభమౌతుంది. భారత జట్టు ఆస్ట్రేలియాను ఎదుర్కొంటుంది.

Oct 16, 2022, 7:43 am IST

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్ రెండు వామప్ మ్యాచ్‌లను ఆడబోతోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో తలపడటానికి సన్నద్ధమౌతోంది.

Oct 16, 2022, 7:25 am IST

మధ్యాహ్నం 1:30కు రెండో మ్యాచ్ ఆరంభమౌతుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్-నెదర్లాండ్స్ పోటీ పడనున్నాయి.

Oct 16, 2022, 6:51 am IST

టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ ఓపెనింగ్ మ్యాచ్ ఇంకాస్సేపట్లో ఆరంభం కానుంది. ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ షెడ్యూల్ అయింది. శ్రీలంక-నమీబియా తలపడనున్నాయి.

Oct 15, 2022, 4:59 pm IST

ఈనెల 23వ తేదీన చిరకాల ప్రత్యర్థి పాక్‌తో తలపడనున్న భారత్

Oct 15, 2022, 4:58 pm IST

ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న మెగా టోర్నమెంట్

Oct 15, 2022, 4:56 pm IST

ఐసీసీ టీ20 ప్రపంచకప్

ఆదివారం ప్రారంభం కానున్న ఐసీసీ టీట్వంటీ ప్రపంచ కప్

Story first published: Saturday, October 15, 2022, 16:57 [IST]
Other articles published on Oct 15, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+