Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ICC Rankings: జెట్ స్పీడ్ తో దూసుకెళ్లిన వరుణ్, తిలక్ వర్మ

టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్రస్తుతం కెరీర్ లో సూపర్‌ ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచుల్లోనూ అదిరే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయితే ఇప్పుడీ ప్రదర్శనతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లాడు. బౌలింగ్ లో కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకును అందుకున్నాడు. ఏకంగా 25 స్థానాలు ఎగబాకి ఐదో ర్యాంకుకు చేరుకున్నాడు.

తిలక్ వర్మ కెరీర్ బెస్ట్ ర్యాంక్
బ్యాటింగ్ విభాగంలో మూడో స్థానంలో ఉన్న తిలక్ వర్మ.. తాజా ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి దూసుకెళ్లాడు. 832 పాయింట్లతో సెకండ్ ప్లేస్ లో నిలిచాడు. ప్రస్తుతం టాప్ ప్లేస్ లో 855 పాయింట్లతో ట్రావిస్ హెడ్ కొనసాగుతున్నాడు. సూర్య కుమార్ యాదవ్, జోస్ బట్లర్ నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.

ICC T20 Rankings Varun Chakravarthy Tilak varma Career best rankings and Axar patel jump to 11th rank

బౌలింగ్ ర్యాంకింగ్స్‌ టాప్ - 10 వీరే

బౌలింగ్ ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ మళ్లీ తన అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఒక స్థానం ఎగబాకి టాప్ ప్లేస్ లోకి వెళ్లాడు. ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ 13 స్థానాలు ముందుకు జరిగి ఆరో స్థానంలో నిలిచాడు. టీమిండియా అక్షర్ పటేల్ ఐదు ర్యాంకులు జంప్ చేసి.. 11వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఫాస్ట్‌ బౌలర్‌ అర్ష్‌దీప్ సింగ్ 9వ ర్యాంకులో నిలిచాడు. రవి బిష్ణోయ్‌ ఐదు స్థానాలు కిందకి పడి 10వ స్థానంలో నిలిచాడు.

1.718 రేటింగ్ పాయింట్లతో ఆదిల్ రషీద్ అగ్రస్థానం,
2.707 రేటింగ్ పాయింట్లతో అకీల్ హోస్సేన్ రెండో స్థానం
3.698 రేటింగ్ పాయింట్లతో వానిందు హసరంగ మూడో స్థానం
4.694 రేటింగ్ పాయింట్లతో ఆడమ్ జంపా నాలోగో స్థానం
5.679 రేటింగ్ పాయింట్లతో వరుణ్ చక్రవర్తి ఐదో స్థానం

Story first published: Wednesday, January 29, 2025, 16:15 [IST]
Other articles published on Jan 29, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+