Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ICC T20 Rankings: తిలక్ వర్మకు బంపర్ లిఫ్ట్!.. సూర్యకు ఎదురుదెబ్బ!

ICC T20 Rankings: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) బుధవారం(జూన్ 11) నాడు విడుదల చేసిన తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. ఐపీఎల్ 2025 సీజన్ కారణంగా అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు తక్కువగా జరగడంతో, ర్యాంకింగ్స్‌లో పెద్దగా మార్పులు కనిపించలేదు. అయితే, కొందరు ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌లో స్వల్ప మార్పులు సంభవించాయి.

బ్యాటింగ్‌లో ట్రావిస్ హెడ్ ఆధిపత్యం.. తిలక్ వర్మకు లాభం
పురుషుల టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ తన నంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ట్రావిస్ హెడ్ 856 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత యువ సంచలనం అభిషేక్ శర్మ 829 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి తన స్థానాన్ని నిలుపుకున్నాడు. ఈ తాజా ర్యాంకింగ్స్‌లో భారత యువ బ్యాటర్ తిలక్ వర్మకు ఒక స్థానం మెరుగుపడింది. 804 పాయింట్లతో తిలక్ వర్మ నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్ నుంచి ఇంగ్లాండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ తన పేరును ఉపసంహరించుకోవడంతో అతని ర్యాంకు పడిపోయి తిలక్ వర్మకు లాభం చేకూరింది. సాల్ట్ ఒక స్థానం దిగజారి నాలుగో స్థానానికి చేరుకున్నాడు.

ICC T20 Rankings Tilak Varma Gets a Big Boost Suryakumar Yadav Slips to Sixth Place

సూర్య కుమార్ యాదవ్‌కు షాక్
భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు టీ20 ర్యాంకింగ్స్‌లో నిరాశ ఎదురైంది. 739 పాయింట్లతో సూర్యకుమార్ యాదవ్ ఒక స్థానం దిగజారి ఐదో స్థానం నుంచి ఆరో స్థానానికి చేరుకున్నాడు. 772 పాయింట్లతో సూర్య స్థానాన్ని ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఆక్రమించాడు. జోస్ బట్ల ఒక స్థానాన్ని మెరుగుపరచుకుని ఐదో స్థానానికి చేరుకున్నాడు.

టెస్ట్ ర్యాంకింగ్‌లో మార్పులు జరిగే అవకాశం
వచ్చే వారం కొత్త ఐసీసీ ర్యాంకింగ్‌లో కూడా మార్పులు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే జూన్ 11 నుండి లండన్‌లోని లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2025లో తలపడుతున్నాయి. ఈ కారణంగా కొత్త టెస్ట్ ర్యాంకింగ్‌లో మార్పులు జరగనున్నాయి.

Story first published: Wednesday, June 11, 2025, 15:54 [IST]
Other articles published on Jun 11, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+