న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ICC T20 Rankings: టాప్‌-5లోకి కేఎల్‌ రాహుల్‌

ICC T20 Rankings: Rahul gains a spot, Kuldeep drops a notch

హైదరాబాద్: ఆస్ట్రేలియాపై రెండు టీ20ల్లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ తన ర్యాంకుని మరింతగా మెరుగుపరచుకున్నాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన బ్యాటింగ్‌ ర్యాంకుల్లో కేఎల్ రాహుల్ 726 పాయింట్లతో ఒక స్థానం ఎగబాకి ఐదో ర్యాంకును దక్కించుకున్నాడు.

ఇండియా vs ఆస్ట్రేలియా, 5th ODI: తుది జట్టులో చోటు వీరికే!ఇండియా vs ఆస్ట్రేలియా, 5th ODI: తుది జట్టులో చోటు వీరికే!

కాఫీ విత్‌ కరణ్‌ షోలో వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత రాహుల్‌ జట్టులో చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. భారత్‌-ఏ తరఫున ఆడి ఫామ్‌ అందుకున్నాడు. నిషేధం ముగిసిన తర్వాత జట్టులోకొచ్చిన రాహుల్ రెండు మ్యాచ్‌ల్లో రాణించి తాజా ర్యాంకింగ్స్‌లో ఐదో ర్యాంక్‌కు చేరుకున్నాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టీ20ల సిరిస్‌లో కేఎల్ రాహుల్ వరుసగా 47, 50 పరుగులతో రాణించాడు. దీంతో తాజా ర్యాంకుల్లో అతడి స్థానం మెరుగైంది. మరోవైపు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(699) ఒక స్థానం దిగజారి ఐదుకు పరిమితమయ్యాడు.

ఇక, ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్‌ఖాన్(780) నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్నాడు. జట్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే పాకిస్థాన్ (135) టీమిండియా కన్నా 13 రేటింగ్‌ పాయింట్ల ఆధిక్యంతో తొలి స్థానంలో కొనసాగుతోంది. భారత్‌ (122), ఇంగ్లాండ్‌ (121) రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి.

Story first published: Wednesday, March 13, 2019, 10:23 [IST]
Other articles published on Mar 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X