ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత యువ కెరటం ఇషాన్ కిషన్ అదరగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో ఇషాన్ కిషన్ భారీ జంప్ చేశాడు. ఇషాన్ ఏకంగా 17 స్థానాలను మెరుగుపరుచుకున్నాడు. ఇటీవల జరిగిన మ్యాచ్‌లలో తన దూకుడుతో పరుగుల వర్షం కురిపించిన ఇషాన్ కిషన్.. తాజా ర్యాంకింగ్స్‌లో 8వ స్థానానికి చేరుకున్నాడు. టాప్-10లో చోటు దక్కించుకోవడమే కాకుండా తన రేటింగ్‌ను గణనీయంగా పెంచుకోవడంలో ఇషాన్ కిషన్ సక్సెస్ అయ్యాడు. 197.50 స్ట్రైక్ రేట్‌తో ఇషాన్ కిషన్ చేసిన పరుగులు ఐసీసీ పాయింట్ల పట్టికలో భారీ మార్పులకు కారణమయ్యాయి.
అగ్రస్థానంలోనే కొనసాగుతున్న అభిషేక్ శర్మ.. మారని సూర్య స్థానం
మరోవైపు భారత యువ సెన్సేషన్ అభిషేక్ శర్మ తన నంబర్ 1 స్థానాన్ని పదిలం చేసుకున్నారు. గత కొన్ని ఇన్నింగ్స్‌ల్లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా.. తన వద్ద ఉన్న 891 రేటింగ్ పాయింట్లతో ప్రపంచ అత్యుత్తమ టీ20 బ్యాటర్‌గా అభిషేక్ శర్మ కొనసాగుతున్నాడు. ఇక టీ20 స్పెషలిస్ట్, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన నిలకడైన ప్రదర్శనతో 6వ స్థానంలో స్థిరంగా ఉండగా.. యువ ఆటగాడు తిలక్ వర్మ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని 4వ ర్యాంకుకు చేరుకున్నాడు. టాప్-10లో నలుగురు భారత బ్యాటర్లు ఉండటం టీమిండియా బ్యాటింగ్ బలానికి నిదర్శనం.

ప్రపంచ స్థాయి ఆటగాళ్ల మధ్య పోటీ
తాజా ర్యాంకింగ్స్‌లో ఇతర దేశాల ఆటగాళ్లలో కూడా భారీ మార్పులు కనిపించాయి. ఇంగ్లండ్‌కు చెందిన ఫిల్ సాల్ట్ రెండో స్థానంలో కొనసాగుతుండగా.. టీ20 ప్రపంచకప్‌లో సెంచరీతో అదరగొట్టిన శ్రీలంక బ్యాటర్ పాతుమ్ నిస్సంకా మూడు స్థానాలు మెరుగుపరుచుకుని మూడో ర్యాంకును కైవసం చేసుకున్నాడు. పాకిస్థాన్ ఆటగాడు సాహిబ్‌జాదా ఫర్హాన్ 5వ స్థానంలో, ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ 7వ స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్ మాత్రం 10వ స్థానానికి పడిపోయాడు.
భారత క్రికెట్లో యువ ఆటగాళ్ల హవా
ఈ ర్యాంకింగ్స్ విశ్లేషిస్తే.. భారత క్రికెట్లో యువ ఆటగాళ్ల హవా స్పష్టంగా కనిపిస్తోంది. సీనియర్ల గైర్హాజరీలో కూడా అభిషేక్, తిలక్, ఇషాన్ వంటి యువకులు ప్రపంచ స్థాయి ర్యాంకుల్లో అగ్రస్థానంలో ఉండటం గమనార్హం. ముఖ్యంగా ఇషాన్ కిషన్ కనబరుస్తున్న దూకుడు రాబోయే మ్యాచ్‌ల్లో ఆయనను మరిన్ని మెరుగైన స్థానాలకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ప్రపంచకప్ కీలక దశకు చేరుకుంటున్న తరుణంలో భారత బ్యాటర్లు ఇలాంటి ఫామ్‌లో ఉండటం జట్టుకు పెద్ద సానుకూలాంశం.
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్-10 బ్యాటర్లు
1. అభిషేక్ శర్మ
2. ఫిల్ సాల్ట్
3. పాతుమ్ నిస్సంకా
4. తిలక్ వర్మ
5. సాహిబ్జాదా ఫర్హాన్
6. సూర్యకుమార్ యాదవ్
7.జోస్ బట్లర్
8.ఇషాన్ కిషన్
9. టిమ్ సీఫర్ట్
10. ట్రావిస్ హెడ్