Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మెరుగైన స్థానాల్లోకి కుల్దీప్, రోహిత్‌లు.. కోహ్లీ 15వ స్థానంలోకి..

ICC T20 Rankings: India remain no.2, Kuldeep Yadav reaches career-high spot

హైదరాబాద్: వెస్టిండీస్‌తో మూడు ఫార్మాట్‌లు ముగిశాయి. ఇక భారత్ ముందుంది ఆస్ట్రేలియా పర్యటన మాత్రమే. టెస్టు, వన్డేలతో పాటు టీ20లలో విజయం దక్కించుకుంది టీమిండియా. టీ20లలో నాయకత్వం వహించి వెస్టిండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన రోహిత్ శర్మకు మరో శుభవార్త. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకుల జాబితాలో టాప్ 7 స్థానాన్ని చేరుకున్నాడు.

రోహిత్ 3 స్థానాలు పైకి చేరి 7వ ర్యాంక్‌‌

రోహిత్ 3 స్థానాలు పైకి చేరి 7వ ర్యాంక్‌‌

సోమవారం ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు సత్తాచాటారు. ఈ సిరీస్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కనబర్చి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌'గా నిలిచిన కుల్దీప్ ఏకంగా 14 స్థానాలు ఎగబాకి 23వ ర్యాంక్‌‌ని అందుకున్నాడు. ఇక కెరీర్‌లో 4వ టీ20 సెంచరీ బాదిన రోహిత్ శర్మ 3 స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో ర్యాంక్‌‌ను చేజిక్కించుకున్నాడు.

ధావన్ 5 స్థానాలు ఎగబాకి 16వ ర్యాంక్‌ని

ధావన్ 5 స్థానాలు ఎగబాకి 16వ ర్యాంక్‌ని

ఆదివారం రాత్రి ముగిసిన మూడో టీ20లో 92 పరుగులు చేసిన శిఖర్ ధావన్ 5 స్థానాలు ఎగబాకి 16వ ర్యాంక్‌ని అందుకున్నాడు. టీ20 సిరీస్‌లో విఫలమైనా.. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ టాప్-5లో చోటు నిలబెట్టుకోగా.. రోహిత్‌కి పగ్గాలప్పగించి రెస్ట్ తీసుకున్న రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి 15వ స్థానానికి పడిపోయాడు.

టాప్-5లో చోటు నిలబెట్టుకున్నచాహల్

టాప్-5లో చోటు నిలబెట్టుకున్నచాహల్

తొలి రెండు టీ20ల్లోనూ రిజర్వ్ బెంచ్‌కే పరిమితమై.. ఆఖరి టీ20లో అవకాశం దక్కించుకున్న మణికట్టు స్పిన్నర్ చాహల్ రెండు వికెట్లు పడగొట్టడం ద్వారా.. టాప్-5లో చోటు నిలబెట్టుకున్నాడు. స్థాన మార్పుల్లో పెద్దగా ప్రభావం భువనేశ్వర్, బుమ్రాలపై పడలేదు. వరుసగా 20, 21వ స్థానాల్లో నిలిచారు.

126 పాయింట్లతో భారత్ రెండో స్థానంలో:

126 పాయింట్లతో భారత్ రెండో స్థానంలో:

టీ20 జట్టు ర్యాంకింగ్స్‌లో 138 పాయింట్లతో పాకిస్థాన్ అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. భారత్ జట్టు 126 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. కానీ, భారత్ చేతిలో క్లీన్ స్వీప్‌కు గురైన వెస్టిండీస్ ఏకంగా 7 స్థానానికి పడిపోయింది.

Story first published: Monday, November 12, 2018, 17:15 [IST]
Other articles published on Nov 12, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+