Latest ICC T20 Rankings: వరల్డ్ బిగ్గెస్ట్ టీ20 లీగ్ ఐపీఎల్ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా టీ20 ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ). ఇందులో ఎక్కువ మంది భారత ప్లేయర్లు స్థానం సంపాదించుకున్నారు. టాప్ -5 బ్యాటర్లలో ముగ్గురు ఇండియన్ ప్లేయర్స్ కు, టాప్ -10 బౌలర్లలో ముగ్గురు భారత ఆటగాళ్లకు చోటు దక్కడం విశేషం. అలాగే ఆల్ రౌండర్లలో అగ్రస్థానం మనోడిదే కావడం మరో విశేషం.
టాప్ -5 బ్యాటర్లలో ముగ్గురు మనోళ్లే..
బ్యాటింగ్ విభాగంలో ఆస్ట్రేలియా ట్రావిస్ హెడ్ 856 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. అభిషేక్ శర్మ 829 పాయింట్లతో రెండో ర్యాంకులో ఉండగా, తిలక్ వర్మ 804 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ 739 పాయింట్లతో 5వ ర్యాంకును దక్కించుకున్నాడు. ఫిల్ సాల్డ్ రెండో స్థానంలో నిలిచాడు.

టాప్-10 బౌలర్లలో ముగ్గురు మనోళ్లే...
బౌలింగ్ విభాగంలో 707 రేటింగ్ పాయింట్లతో వెస్టిండీస్ అకీల్ హోసెన్ అగ్రస్థానంలో ఉండగా వరుణ్ చక్రవర్తి 706 పాయింట్లో రెండో ర్యాంకును దక్కించుకున్నాడు. 674 పాయింట్లతో ఆరో స్థానంలో రవి బిష్ణోయ్, 653 పాయింట్లతో అర్షదీప్ సింగ్ 9వ ర్యాంకును దక్కించుకున్నారు. ఆల్ రౌండ్ విభాగంలో హార్దిక్ పాండ్య 252 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టాప్ -10లో ఇండియన్ ప్లేయర్స్ ఇంకెవరూ స్థానం సంపాదించుకోలేదు.