For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లంక బౌలర్ ధనంజయపై ఐసీసీ నిషేదం

ICC suspends Sri Lanka spinner Akila Dananjaya from bowling over illegal action

న్యూ ఢిల్లీ: శ్రీలంక క్రికెట్‌కు చేదు వార్త. ఆ దేశ జాతీయ జట్టు శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ అఖిల దనంజయపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిషేదం విధించింది. అనుమానస్పద బౌలింగ్ యాక్షన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడి బౌలింగ్ యాక్షన్‌ను ఐసీసీ పరిశీలించింది. నిబంధనలను అతక్రమించి అనుమతి ఇచ్చిన 15 డిగ్రీల కంటే ఎక్కువగా దనంజయ్ చేతిని వంచుతున్నట్లు గుర్తించింది అసహనం వ్యక్తం చేసింది.

దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో దనంజయ్ బౌలింగ్ చేయడాన్ని నిషేధిస్తున్నట్లు సోమవారం (డిసెంబర్ 10న) ఓ ప్రకటనలో ఐసీసీ వెల్లడించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందంటూ వేటును త్వరితం చేసింది.

'ఐసీసీ ఆర్టికల్ 11.1 ప్రకారం అనుమానిత బౌలింగ్ యాక్షన్ ఉన్న బౌలర్లను పరిశీలించవచ్చు. తమ పరిధిలోకి వచ్చే అంతర్జాతీయ, జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల నుంచి నిషేధం విధించాం. మరోవైపు ఆర్టికల్ 11.5 నిబంధన ప్రకారం ఐసీసీ అనుమతితో శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్వహించే దేశవాలీ టోర్నీల్లో దనంజయ ఆడవచ్చు' అని ఐసీపీ పేర్కొంది.

శ్రీలంకలో గాలేలో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులోనే దనంజయ బౌలింగ్ యాక్షన్‌పై విమర్శలు వచ్చాయి. దీంతో ఆ సిరీస్‌లో 2 టెస్టులాడిన దనంజయను చివరి టెస్టు నుంచి లంక తప్పించింది. చివరికి 3-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్ చేసింది. నవంబరు 23న బ్రిస్బేన్‌లోని నేషనల్ క్రికెట్ సెంటర్‌లో దనంజయ బౌలింగ్‌ను పరీక్షించారు. బౌలింగ్ రూల్స్ ప్రకారం 15 డిగ్రీలకు మించి చేతిని వంచుతున్నట్లు ఖరారైంది. దీంతో అతనికి వేటు తప్పలేదు.

Story first published: Tuesday, December 11, 2018, 9:23 [IST]
Other articles published on Dec 11, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+