ఐసీసీ షాకింగ్ నిర్ణయం.. ఆ దేశ క్రికెట్ బోర్డుపై కొరడా!
కెనడా క్రికెట్ బోర్డుకు ఐసీసీ ఊహించని షాక్ ఇచ్చింది. ఆ దేశ క్రికెట్ బోర్డులో చోటుచేసకున్న పరిపాలనా లోపాలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకుంది. క్రికెట్ కెనడాకు అందాల్సిన నిధులను రాబోయే 6 నెలల పాటు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత కొంతకాలంగా కెనడా క్రికెట్ పాలనలో జరుగుతున్న అంతర్గత వివాదాలు, ఐసీసీ నిబంధనల ఉల్లంఘనలపై జరిపిన విచారణల అనంతరం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ నిర్ణయం వల్ల కెనడా క్రెకెట్ మ్యాచ్ లపై తక్షణ ప్రభావం పడకపోయినప్పటికీ.. ఆర్థికంగా ఆ బోర్డు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది.
కెనడా క్రికెట్ బోర్డు పూర్తిగా ఐసీసీ ఇచ్చే నిధులపైనే ఆధారపడి నడుస్తోంది. కెనడా క్రికెట్ బోర్డు వార్షికాదాయంలో దాదాపు 63 శాతం వాటా నేరుగా ఐసీసీ ఫండింగ్ ద్వారానే వస్తుంది. 2024 ఆర్థిక సంవత్సర లెక్కల ప్రకారం బోర్డు మొత్తం రాబడి సుమారు 5.7 మిలియన్ కెనడియన్ డాలర్లు (దాదాపు రూ. 40 కోట్లు) కాగా.. అందులో ఐసీసీ నుంచే ఏకంగా 3.6 మిలియన్ కెనడియన్ డాలర్లు వచ్చాయి. ఇప్పుడు ఈ నిధులన్నీ ఆరు నెలల పాటు ఆగిపోనుండటంతో బోర్డు నిర్వహణ కెనడాకు అత్యంత భారంగా మారనుంది.

నిధుల నిలిపివేతకు గల ఖచ్చితమైన కారణాలను ఐసీసీ అధికారికంగా ప్రకటించనప్పటికీ.. కెనడాకు చెందిన 'ద ఫిఫ్త్ ఎస్టేట్' అనే ఇన్వెస్టిగేటివ్ ప్రోగ్రామ్ బయటపెట్టిన నిజాలు దీనికి కారణమని తెలుస్తోంది. బోర్డులో ఆర్థిక అవకతవకలు, ఐసీసీ పాలసీల ఉల్లంఘనలపై ఈ ప్రోగ్రామ్ ఒక డాక్యుమెంటరీని విడుదల చేసింది. అంతేకాకుండా గత టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో కెనడా ఆడిన మ్యాచ్‌పై ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్ (ACU) ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది. మరోవైపు, కెనడా మాజీ కోచ్ ఖుర్రం చౌహాన్ మాట్లాడిన ఒక ఆడియో లీక్ అవ్వడం కూడా బోర్డును మరింత ఇరకాటంలో పడేసింది. జాతీయ జట్టు సెలక్షన్‌లో కొందరు నిర్దిష్ట ఆటగాళ్లనే ఎంపిక చేయాలంటూ బోర్డు సీనియర్ అధికారులు తనపై ఒత్తిడి తెచ్చారని, మ్యాచ్ ఫిక్సింగ్ ప్రయత్నాలు కూడా జరిగాయని ఆ ఆడియోలో ఆయన ఆరోపించడం సంచలనంగా మారింది.
ఈ వివాదాలపై కెనడా క్రికెట్ మీడియా మేనేజర్ జిమ్మీ శర్మ స్పందిస్తూ.. ప్రస్తుత బోర్డుకు ఇవన్నీ గత పాలకులు చేసిన తప్పుల వల్ల వారసత్వంగా వచ్చాయని వెల్లడించారు. బోర్డులో ఉన్న పరిపాలనా లోపాలు, ఆర్థిక నియంత్రణ లోపాలను సరిదిద్దడానికి తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఐసీసీ గానీ, కెనడా క్రికెట్ బోర్డు గానీ ఈ సస్పెన్షన్‌పై ఇంకా పూర్తి స్థాయి అధికారిక ప్రకటనలు విడుదల చేయాల్సి ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications