Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐసీసీకి పొంచి ఉన్న ముప్పు: సమాంతరంగా మరో క్రికెట్‌ వ్యవస్థ

ICC Strategic Group report fears formation of rebel governing body

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్ (ఐసీసీ)ని ఇప్పుడు కొత్త సమస్య వేధిస్తోంది. ఐసీసీకి పోటీగా సమాంతరంగా మరో క్రికెట్‌ వ్యవస్థ రాబోతోందని ఐసీసీ వ్యూహ బృందం (ఎస్‌డబ్ల్యూజీ) ఓ నివేదిక ఇచ్చింది. ఈ బృందం ఈ మేరకు ప్రపంచ క్రికెట్‌ ఎదుర్కొంటున్న ముప్పులు, సమస్యలను ఐసీసీకి సమర్పించిన తమ నివేదికలో వివరించింది.

రాహుల్‌ డేవిడ్‌ పీవర్‌ (క్రికెట్‌ ఆస్ట్రేలియా), ఇమ్రాన్‌ ఖవాజా (సింగపూర్‌), పట్రిసియా కరంబామి (దక్షిణాఫ్రికా), డేవ్‌ కామెరాన్‌ (వెస్టిండీస్‌), మహిళా ప్రతినిధి క్లారె కానర్‌లు సభ్యులుగా ఉన్న ఈ బృందం ఇప్పటికే భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో ఈ అంశంపై చర్చించినట్లు తెలిసింది.

'ఐసీసీకి ముప్పు పొంచి ఉన్న మాట నిజమే. బాగా పేరున్న మాజీ క్రికెట్‌ పాలకుడు (నిషేధంలో ఉన్నాడు).. ఓ భారత ఛానెల్‌, ఓ ఆస్ట్రేలియా న్యాయవాదితో కలిసి చాలా మంది ఆటగాళ్లు, అధికారులను సంప్రదించాడు. ఐసీసీకి సమాంతరంగా మరో ప్రపంచ క్రికెట్‌ సంఘాన్ని ఏర్పాటు చేయాలన్నది వారి ఉద్దేశం' అని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు.

'ఆపరేషన్‌ వాటర్‌షెడ్‌' పేరుతో ఈ తతంగమంతా సాగిందని తెలిపారు. ఐసీసీకి సమాంతర క్రికెట్‌ సమాఖ్య ఏర్పాటే లక్ష్యంగా ఆటగాళ్లకు కోట్ల రూపాయలు ఎరవేసినా ఈ ప్రాజెక్ట్‌ మాత్రం కార్యరూపం దాల్చలేదని... భవిష్యత్తులో ఏర్పాటయ్యే విషయాన్ని కొట్టిపారేయలేమని ఆ అధికారి వెల్లడించారు.

క్రికెట్‌లో తలపండిన ఒక వ్యాపారి, భారత్‌కు చెందిన ఒక టీవీ చానెల్ అధినేత, ఆస్ట్రేలియాలోని ఒక న్యాయవాది ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌లో పేరుప్రఖ్యాతులున్న పలువురు క్రికెటర్లను కలిసి, భారీ మొత్తాలను ఇచ్చి, టీ-10 ఫార్మాట్‌లో ఒక టోర్నమెంట్‌లో పాల్గొనాల్సిందిగా ప్రతిపాదిస్తున్నట్టు ఆ అధికారి తెలిపాడు.

ఇటీవల యూఏఈలో జరిగిన ఒక టోర్నీలో ఇయాన్ మోర్గాన్, షోయబ్ మాలిక్, డ్వెయిన్ బ్రేవో తదితరులు పాల్గొన్న విషయాన్ని గుర్తుచేశాడు. వారి ప్రయత్నాలు ఫలిస్తే, ఐసీసీకి పోటీగా మరో అంతర్జాతీయ క్రికెట్ సంస్థ తెరపైకి వచ్చినా ఆశ్చర్యం లేదని, అందుకే, సమస్య తీవ్రతను గుర్తించి, పరిష్కార మార్గాలను అన్వేషిస్తామని వివరించాడు.

'వాళ్లు ప్రతి దేశంలోనూ వేరే క్రికెట్‌ సంఘాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఆటగాళ్లకు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వజూపుతున్నారు. వాళ్ల పథకం ఇంకా మొదలు కాలేదు. కానీ ఆరంభం కాదని చెప్పలేం' అని బీసీసీఐ ఉన్నతాధికారి తెలిపారు. నిషేధానికి గురైన ఐపీఎల్‌ మాజీ కమిషనర్‌ లలిత్‌ మోడీ ఆధ్వర్యంలో 2016లోనే ఈ వ్యవహారం జరిగినట్లు వెలుగుచూసింది.

Story first published: Thursday, May 17, 2018, 10:09 [IST]
Other articles published on May 17, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+