
హైదరాబాద్: అంతకుముందుతో పోలిస్తే ఐసీసీకు బీసీసీఐ మధ్య విభేదాలు తారా స్థాయికి చేరకున్నాయి. దీనికి కారణం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు(ఐసీసీ) శశాంక్ మనోహర్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించడమే. ఇప్పుడు తాజాగా చాంపియన్స్ ట్రోఫీ విషయంలోనూ ఐసీసీతో బీసీసీఐ విభేదించినట్లు సమాచారం.
టోర్నీకి మరింత మార్కెట్ కల్పించే ఉద్దేశంలో భాగంగా చాంపియన్స్ ట్రోఫీని 50 ఓవర్ల ఫార్మాట్‌కు బదులు టీ20కి మార్చాలని ఐసీసీ ప్రయత్నిస్తున్నది. 2021లో చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమివ్వాల్సిన బీసీసీఐ..ఐసీసీ ప్రతిపాదిత టీ20 చాంపియన్స్ టోర్నీకి ఒప్పుకునే ప్రసక్తే లేదంటూ తేటతెల్లం చేసింది.
గత నెలలో జరిగిన బోర్డు సమావేశంలో ఐసీసీ ఈ నిర్ణయానికి వచ్చినట్లు మీడియా కథనంగా పేర్కొంది. దీనికి ధీటుగా స్పందించిన బీసీసీఐ ఎటువంటి కొత్త ప్రతిపాదనలకైనా వ్యతిరేకిస్తామని పేర్కొంది. బీసీసీఐ మాజీ చీఫ్ డాల్మియా ఐదో వర్థంతిని పురస్కరించుకొని నిర్వహించనున్న టోర్నీల్లో ఎటువంటి మార్పులు ఉండబోవని పేర్కొంది.
దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం గనుక పన్ను మినహాయింపు ఇవ్వని పక్షంలో టోర్నీ వేదికను భారత్ నుంచి తప్పించాలని ఐసీసీ యోచిస్తున్నది. ఆతిథ్యం నుంచి బీసీసీఐ తప్పుకుంటే అదే సమయంలో జరిగే వేరే వేదికల గురించి ఆలోచించాలని ఇప్పటికే మేనేజ్‌మెంట్‌కు ఐసీసీ సూచించినట్లు తెలిసింది.