ENGvsPAK : పాకిస్తాన్‌కు షాకిచ్చిన ఐసీసీ.. ఇంకోసారి ఇదే రిపీట్ అయితే డేంజరే!

పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ షాకిచ్చింది. ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌కు వేదికగా నిలిచిన రావల్పిండి మైదానం మరీ చెత్తగా ఉందని వార్నింగ్ ఇచ్చింది. ఇంతకుముందు ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో కూడా ఇలాంటి చెత్త పిచ్‌నే ఇచ్చినట్లు ఐసీసీ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐసీసీ పిచ్ అండ్ అవుట్ ఫీల్డ్ మానిటరింగ్ ప్రాసెస్ ప్రకారం ఈ పిచ్‌కు 'బిలో యావరేజ్' రేటింగ్ వచ్చింది. రావల్పిండికి ఈ రేటింగ్ రావడం వరుసగా ఇది రెండోసారి కావడం గమనార్హం.

రెండుసార్లు నెగటివ్ పాయింట్స్..
ఐసీసీ పిచ్ రేటింగ్ విధానాల ప్రకారం ఐదేళ్ల పాటు ఈ రేటింగ్స్ వ్యాలిడిటీ సైకిల్ ఉంటుంది. ఈ సమయంలో ఐదు నెగటివ్ పాయింట్స్ వస్తే ఆ మైదానంలో మరో ఏడాది పాటు అంతర్జాతీయ మ్యాచులు నిర్వహించకుండా నిషేధం విధిస్తారు. ఇప్పుడు రావల్పిండికి వరుసగా రెండుసార్లు 'బిలో యావరేజి' రేటింగ్ వచ్చింది.
ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో పిచ్ బాగలేదని రేటింగ్ ఇచ్చారు. అంతకుముందు ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులో కూడా ఇలాంటి పిచ్‌నే వాడటంతో అప్పుడు కూడా ఐసీసీ ఈ మైదానానికి నెగటివ్ పాయింట్లు ఇచ్చింది. మరోసారి ఇలాంటి పిచ్‌నే తయారుచేస్తే మాత్రం ఈ మైదానంలో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచులు జరగడం కష్టంగా మారే అవకాశం ఉంది.

పీసీబీ కూడా ఆగ్రహం..
ముఖ్యంగా ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ సమయంలో ఈ పిచ్‌పై భారీగా విమర్శలు వచ్చాయి. పీసీబీ (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) చైర్మన్ రమీజ్ రజా సైతం పిచ్ నిర్వాహకులను విమర్శించాడు. పలువురు మాజీ దిగ్గజాలు కూడా ఇది టెస్టు మ్యాచ్ ఆడాల్సిన పిచ్ కాదని పెదవి విరిచాడు. ఈ పిచ్ ఫ్లాట్‌గా ఉండటంతో బ్యాటర్లు ఒక ఆట ఆడుకున్నారు. టెస్టు మ్యాచుల చరిత్రలోనే తొలిసారిగా ఇంగ్లండ్ ఆటగాళ్లు తొలి రోజే 500పైగా స్కోరు చేసి అందరికీ షాకిచ్చారు.

అంపైర్ ఏమన్నాడంటే?
'ఈ పిచ్ నుంచి బౌలర్లకు ఏమాత్రం సహకారం అందలేదు. అది స్పిన్నర్లు అయినా, పేసర్లయినా ఎవరు బౌలింగ్ చేసినా ఎలాంటి సహకారం లేదు. దీంతో బ్యాటర్లు చాలా వేగంగా పరుగులు రాబట్టారు. రోజులు గడిచినా కూడా పిచ్‌లో పెద్దగా మార్పులు రాలేదు. బౌలర్లకు ఎలాంటి సహకారం దొరకలేదు. దీంతో ఐసీసీ నిబంధనల ప్రకారం ఈ మైదానానికి 'బిలో యావరేజ్' రేటింగ్ ఇవ్వడం జరిగింది' అని అంపైర్లు తేల్చిచెప్పారు. ఈ మైదానానికి ఇలా నెగటివ్ రేటింగ్ రావడం ఇది వరుసగా రెండోసారని, మరోసారి ఇలాంటి రేటింగ్ వస్తే అంతర్జాతీయ మ్యాచులు నిర్వహించే అర్హత కోల్పోయే ప్రమాదం ఉందని ఐసీసీ కూడా హెచ్చరించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications