బీసీసీఐ రాసిన లేఖ అందింది, ఆటగాళ్ల భద్రతే మా తొలి ప్రాధాన్యత: ఐసీసీ

హైదరాబాద్: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలతో సంబంధాలను తెంచుకోవాలని కోరుతూ బీసీసీఐ శుక్రవారం రాసిన లేఖపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) స్పందించింది. శుక్రవారం సమావేశమైన బీసీసీఐ పాలకుల కమిటీ భారత్-పాక్ మ్యాచ్ రద్దు అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఛైర్మన్ వినోద్ రాయ్ వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నడుచుకుంటాం
ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నడుచుకుంటామని ఆయన తెలిపారు. ఈ క్రమంలో పాక్‌తో మ్యాచ్ ప్రస్తావన లేకుండా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలతో క్రికెట్ సంబంధాలను నిలిపివేయాలని ఐసీసీకి లేఖ రాసింది. వరల్డ్‌కప్‌లో భారత ఆటగాళ్లకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఐసీసీకి రాసిన లేఖలో విన్నవించింది.

ఐసీసీ ఛైర్మన్ శశాంక్ మనోహార్ మాట్లాడుతూ
దీనిపై శనివారం ఐసీసీ ఛైర్మన్ శశాంక్ మనోహార్ మాట్లాడుతూ "బీసీసీఐ రాసిన లేఖ మాకు చేరింది. వరల్డ్‌కప్‌లో ఆటగాళ్ల భద్రతే తమ మొదటి ప్రాధాన్యత. దీనికి ఎప్పుడూ పెద్ద పీటే వేస్తాం. మార్చి 2వ తేదీన జరుగనున్న ఐసీసీ సభ్యుల సమావేశంలో బీసీసీఐ రాసిన లేఖపై పూర్తి స్థాయిలో చర్చిస్తాం. కచ్చితంగా బీసీసీఐకి భద్రతాపరమైన హామీ ఇస్తాం. వరల్డ్‌కప్‌లో మా ఏర్పాట్లుతో బీసీసీఐని సంతృప్తి పరుస్తాం" అని అన్నారు.

డియర్ సార్స్,
పాకిస్థాన్ ఆశ్రయమిస్తున్న ఉగ్రవాదులు పుల్వామాలో భారీ ఉగ్రదాడికి తెగబడ్డారు. ఈ ఘోర ఘటనలో భారతకు చెందిన సీఆర్ఫీఎఫ్ జవాన్లు 44 మంది అమరులయ్యారు. భారత గడ్డపై జరిగిన ఈ దాడిని అనేక మంది ఖండిస్తున్నారు. దాడిని దృష్టిలో పెట్టుకొని మా అభ్యంతరాలు, సెంటిమెంటును ఈ లేఖ ద్వారా తెలియజేస్తున్నాం.
ఉగ్రదాడి నేపథ్యంలో త్వరలో జరిగే వరల్డ్‌కప్‌లో పాల్గొనే ఆటగాళ్లు, అధికారుల భ్రదత, క్షేమం గురించి బీసీసీఐ ఆందోళన పడుతోంది. భారత్‌లో జరిగిన ఉగ్రదాడిని ఐసీసీలోని చాలా సభ్యదేశాలు (బ్రిటన్ సహా) గట్టిగా ఖండించాయి. అందుకే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలతో సంబంధాలు తెంచుకోవాలని క్రికెట్ ప్రపంచాన్ని బీసీసీఐ కోరుతోంది.
ఐసీసీ వరల్డ్‌కప్‌ను వీక్షించేందుకు వచ్చే భారత అభిమానుల భద్రత, క్షేమం గురించీ బీసీసీఐ భయపడుతోంది. మైదానాల్లో ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులు, అభిమానులకు ఐసీసీ, ఈసీబీ పటిష్ట భద్రత కల్పిస్తాయని బీసీసీఐ విశ్వసిస్తోంది. ఈ విషయంలో బీసీసీఐకి అన్ని హక్కులు ఉన్నాయి. గౌరవనీయ సుప్రీం కోర్టు నియమించిన క్రికెట్ పాలకుల కమిటీ తరఫున బీసీసీఐ ఈ లేఖను పంపిస్తోంది.
ఇట్లు
రాహుల్ జోహ్రీ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications