ట్యాంపరింగ్‌పై కుక్: 2012లో ఏం జరిగిందో తెలుసుగా?
మొహాలి: రాజ్ కోట్ టెస్టులో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ బాల్ ట్యాంపరింగ్ చేశాడంటూ బ్రిటిష్ పత్రిక 'డైలీ మెయిల్' వార్తాకథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. కోహ్లీపై వచ్చిన ఆరోపణలకు గాను టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లేతో పాటు పలువురు మాజీలు సైతం స్పందించారు.
కోహ్లీ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్టు బ్రిటిష్ మీడియాలో వచ్చిన వార్తలపై ఇంగ్లాండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ కూడా స్పందించాడు. మొహాలి టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడిన కుక్ బాల్ ట్యాంపరింగ్ నిర్వచనంలో చాలా లోపాలున్నాయని పేర్కొన్నాడు.
ఈ విషయంలో ఐసీసీ మరింత స్పష్టమైన దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉందని అతడు పేర్కొన్నాడు. 'ఏది అంగీకార యోగ్యం, ఏది కాదు అన్న విషయంలో ఐసీసీ స్పష్టత ఇవ్వాలి. ఆటగాడు తన నోటిలోని గమ్‌ను లేదా జెల్లీ బీన్స్‌ను డ్రింక్స్ విరామం సమయంలో ఉమ్మేసి, ఆ తర్వాత తొలి ఓవర్లోనే ఉమ్మిని బంతికి రాస్తే ఏం చేస్తారు. టాంపరింగ్‌పై ఐసీసీ స్పష్టత ఇవ్వాలి' అని కుక్ అన్నాడు.
ఇక రెండో టెస్టులో ఓటమి పాలైనప్పటికీ, మొహాలి టెస్టులో టీమిండియాకు గట్టి పోటీ ఇస్తామని కుక్ ధీమా వ్యక్తం చేశాడు. మూడో టెస్టులో తాము 'అండర్ డాగ్' ముద్రతో మైదానంలోకి దిగుతున్నామన్నది వాస్తవమని చెప్పాడు. అయితే, ప్రతి క్షణం పోరాటం సాగిస్తామని చెప్పాడు.

టెస్టుల్లో నెంబర్ వన్
సిరిస్‌లో ఒక టెస్టుతో వెనుకంజలో ఉన్నామని చెప్పిన కుక్, ప్రస్తుతం భారత్ టెస్టుల్లో నెంబర్ వన్ స్ధానంలో ఉందని అన్నాడు. అందులోనూ సొంతగడ్డపై భారత్‌ను ఎదుర్కొనడం ఆషామాషీ వ్యవహారం కాదని కుక్ అంగీకరించాడు. భారత్ బలాన్ని తక్కువ అంచనా వేయడం లేదని, సవాళ్లను విసిరే సత్తా తమకు ఉందని చెప్పాడు.

ఇంగ్లాండ్ జట్టు పటిష్టంగా ఉంది
గతేడాది కాలంగా ఇంగ్లాండ్ జట్టు పటిష్టంగా ఉందని, అద్భుతమైన ఫామ్‌లో ఆటగాళ్లు ఉన్నారని కుక్ అన్నాడు. గతేడాది దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లి, అప్పట్లో టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో ఉన్న ఆ జట్టును ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశాడు.

యువ ఆటగాళ్లు పోటీపడుతున్నారు
టీమిండియాతో జరుగుతున్న ప్రస్తుత సిరీస్‌ను అప్పటి దక్షిణాఫ్రికాతో జరిగిన పోరుతో పోల్చలేమని స్పష్టం చేసిన కుక్, జాతీయ జట్టులోకి వచ్చేందుకు చాలా మంది యువ ఆటగాళ్లు పోటీపడుతున్నారని చెప్పుకొచ్చాడు. భారత్ పర్యటనకు వచ్చే ముందు బంగ్లాలో ఆడిన రెండు టెస్టుల సిరీస్ డ్రాగా ముగించామని కుక్ అన్నాడు.

2012లో కూడా ఇలానే జరిగింది
ఢాకాలో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో ఎదురైన పరాజయాన్ని పక్కకుపెట్టి, భారత్‌తో టెస్టుకు మళ్లీ సరికొత్తగా సిద్ధమయ్యామని అన్నాడు. 2012లో తాము భారత్‌లో పర్యటించినప్పుడు, అహ్మదాబాద్‌లో జరిగిన మొదటి టెస్టును కోల్పోయామని చెప్పిన కుక్, ఆ మ్యాచ్ ముగిసిన వెంటనే తాను మీడియాతో మాట్లాడుతూ అన్న మాటలు ఇప్పటికీ గుర్తున్నాయని తెలిపాడు.

3-1 ఆధిక్యంతో సిరీస్‌ను సాధించాం
అప్పట్లో ఆ సిరీస్‌ను భారత్ 4-0 తేడాతో గెల్చుకుంటుందని తాను జోస్యం చెప్పానని, కానీ, మిగతా మూడు టెస్టులను తమ ఖాతాలో వేసుకొని, తామే 3-1 ఆధిక్యంతో సిరీస్‌ను సాధించామని కుక్ వెల్లడించాడు. క్రికెట్‌లో ఎప్పుడైనా.. ఏదైనా జరగవచ్చనడానికి ఇదే నిదర్శనమని, 0-1 తేడాతో వెనుకబడినా తమ ఆత్మవిశ్వాసం తగ్గలేదని వ్యాఖ్యానించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications