Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సైమండ్స్‌కు నున్నగా గుండు గీస్తున్న బ్రెట్‌ లీ!!

ICC Shares Hilarious Picture Of Brett Lee, Andrew Symonds

దుబాయ్‌: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రీడాలోకం స్థంబించిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో కొంత మంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) కూడా పాత, కొత్త జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ బిజీగా ఉంటోంది. ఈ క్రమంలో తాజాగా ఐసీసీ తమ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసిన ఒక పాత ఫోటో వైరల్ అయింది.

ఐసీసీ తాజాగా ఆసీస్‌ మాజీ క్రికెటర్లు ఆండ్రూ సైమండ్స్‌-బ్రెట్‌ లీ ఫొటోను షేర్‌ చేసింది. సైమండ్స్‌కు బ్రెట్‌ లీ నున్నగా గుండు గీస్తున్న ఫోటో అది. 'హెయిర్‌ అప్రిసియేషన్‌ డే'ను పురస్కరించుకుని ఈ ఫోటోను ఐసీసీ ట్వీట్ చేసింది. క్రికెట్‌ కెరీర్‌లో ఎప్పుడూ విన్నూత్నంగా కనబడే సైమండ్స్‌.. రకరకాల హెయిర్‌ స్టైల్స్‌తో అలరించేవాడు. ఈ క్రమంలోనే సైమండ్స్‌ తలపై ట్రిమ్మర్‌తో బ్రెట్‌ లీ గుండు గీసిన ఒకనాటి జ్ఞాపకాన్ని ఐసీసీ మళ్లీ గుర్తు చేసింది.

ఐసీసీ ఫొటో షేర్ చేస్తూ... 'హ్యాపీ హెయిర్‌ అప్రిసియేషన్‌ డే.. ఐసోలేషన్‌లో ఉన్న మీకు ఎవరు హెయిర్‌ స్టైల్‌ చేస్తున్నారు' అని క్యాప్షన్‌ ఉంచింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్ అయింది. ఫాన్స్ తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 1998లో పాకిస్తాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌ ద్వారా ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేసిన సైమండ్స్‌.. 198 వన్డేలు ఆడాడు. వైట్‌బాల్‌ క్రికెట్‌లో అటు బ్యాట్‌తో, ఇటు బంతితో రాణించిన సైమండ్స్‌ తనదైన ముద్ర వేశాడు. వన్డేల్లో 5,008 పరుగులు, 133 వికెట్లు సాధించాడు. ఇక 26 టెస్టు మ్యాచ్‌లు, 14 అంతర్జాతీయ టీ20లను సైమండ్స్‌ ఆడాడు.

బ్రెట్‌ లీ తన కెరీర్‌లో 221 వన్డే మ్యాచ్‌లు ఆడి 380 వికెట్లు సాధించాడు. ఇక 76 టెస్టుల్లో 310 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఆసీస్‌ తరఫున 25 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన బ్రెట్‌ లీ 28 వికెట్లను తీశాడు. 2012లో ఆసీస్‌ తరఫున చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు బ్రెట్‌ లీ. తాజాగా ఓ టెలివిజ‌న్ షోలో బ్రెట్‌ లీ త‌న అనుభ‌వాల‌ను వివ‌రించాడు. ఏ బౌలర్‌కు మీరు బయపడుతారు అని హోస్ట్ అడగ్గా.. అందరికి అని లీ సమాధానం ఇస్తాడు. ఇక షోయ‌బ్ అక్త‌ర్‌ బౌలింగ్‌ను ఏ విధంగా ఎదుర్కొన్నాడ‌నేది కూడా చెప్పుకొచ్చాడు. 'నేను బ్యాటింగ్‌ చేసేటప్పుడు ప్ర‌తీ ఒక్క బౌల‌ర్‌కు భ‌య‌ప‌డేవాడిని. ముఖ్యంగా స్పిన్న‌ర్ల‌కు కూడా. ఇక షోయ‌బ్ అక్త‌ర్ బౌలింగ్‌కు కూడా భ‌య‌ప‌డేవాడిని. అత‌డు బౌలింగ్ చేస్తుంటే.. న‌న్ను చంప‌డానికే బౌలింగ్ వేస్తున్నాడేమోన‌ని అనిపించేది' అని లీ తెలిపాడు.

Story first published: Friday, May 1, 2020, 19:34 [IST]
Other articles published on May 1, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+