Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Serbia Bowler Celebration: ఇదేం సెలెబ్రేషన్ నాయనా.. వికెట్ తీస్తే పల్టీలు కొట్టి చచ్చిన శవంలా పడిపోయి..!

ICC Shares A Variety Celebration Video Of Serbia Bowler

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తన సోషల్ మీడియా ఖాతాలోని ఇన్‌స్టా వేదికగా ఓ ఫన్నీ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో సెర్బియా దేశం తరఫున ఆడే బౌలర్ ఒకడు తన బౌలింగ్‌లో వికెట్ పడినప్పుడల్లా డిఫెరెంట్ లెవెల్లో సెలెబ్రేషన్స్ చేసుకోవడం కన్పించింది. ఈ వినోదభరితమైన వీడియోను ఐసీసీ ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా.. నెట్టింటా వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో 1.5మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక ఈ ఘటన విషయానికొస్తే.. జులై 13న సెర్బియా వర్సెస్ ఐల్ ఆఫ్ మ్యాన్ మధ్య మ్యాచ్ జరిగింది.

ఇక ఈ మ్యాచ్‌లో సెర్బియా బౌలర్ అయో మెనె-ఎజెగి వికెట్‌ తీసుకున్నప్పుడల్లా.. పల్టీలు కొట్టి.. చచ్చిన శవంలా పడుకుని డిఫెరెంట్‌గా సెలెబ్రేషన్ చేసుకున్నాడు. అతను ఈ రకమైన సెలబ్రేషన్స్ చేసుకోవడం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. ఇక బౌలర్లు తాము వికెట్ తీసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కో రకంగా సెలబ్రేట్ చేసుకుంటారనే సంగతి తెలిసిందే.

అంతర్జాతీయ స్థాయిలో నైజీరియా మరియు సెర్బియా దేశాలకు మెనె-ఎజెగి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక తాజాగా జరిగిన మ్యాచ్‌లో ఐల్ ఆఫ్ మ్యాన్ బ్యాటింగ్ చేస్తుండగా అతను నాలుగు వికెట్లు పడగొట్టి ఆ జట్టును దెబ్బతీశాడు. ఇక వికెట్ల అనంతరం అతని వేడుకలే కాకుండా అతని పిన్‌పాయింట్ యార్కర్లను కూడా నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

అతను ఓ అథ్లెట్ కావడం వల్ల కూడా ఆ రకమైన సెలెబ్రేషన్లు జరుపుకుంటున్నట్లు అర్థమవుతుంది. ఐరిష్ సముద్రంలో ఒక చిన్న ద్వీపం ఐల్ ఆఫ్ మ్యాన్. ఇక ఈ ఇరుజట్లు ICC పురుషుల టీ20 సబ్-రీజినల్‌లో పోటీపడుతున్నాయి. యూరోపియన్ క్వాలిఫైయర్ టోర్నమెంట్ ఇది. ఆ దేశాల్లో క్రికెట్‌కు పెద్దగా ఆదరణ లేకపోయినా.. ఇప్పుడిప్పుడే క్రికెట్ ప్రాచుర్యం పెరుగుతుంది.

Story first published: Friday, July 22, 2022, 18:19 [IST]
Other articles published on Jul 22, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+