For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్టోక్స్‌కు సారీ చెప్పిన ఐసీసీ.. ఎందుకో తెలుసా?

ICC says Sorry to England all-rounder Ben Stokes

లండన్‌ : తాజాగా మూడు ఫార్మాట్లలో అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్ ‌(ఐసీసీ) ఈ దశాబ్దపు జట్టు, వ్యక్తిగత పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ దశాబ్దంలో టెస్టు క్రికెట్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన 11 మందిని ఎంపిక చేసి ఒక జట్టుగా ప్రకటించింది. ఈ జట్టుకు విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా ఎంపిక చేయగా.. తుది జట్టులో ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్ స్టోక్స్ ‌ కూడా చోటు దక్కించుకున్నాడు.‌ స్టోక్స్‌ టెస్టులతో పాటు వన్డే దశాబ్దపు జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. ఈ దశాబ్దపు టెస్టు జట్టులో స్థానం సంపాదించిన వారికి ఐసీసీ టెస్టు క్యాప్‌లు బహుకరించింది. అయితే ఐసీసీ అందించిన క్యాప్స్‌పై స్టోక్స్ అసంతృప్తి వ్యక్తంచేశాడు.

'ఈ దశాబ్దపు అవార్డుల్లో టెస్టు జట్టు సభ్యులకు ఇచ్చిన క్యాప్ ఆస్ట్రేలియా జట్టు వేసుకొనే బ్యాగీ గ్రీన్ కలర్‌లో ఉంది. ఇది నాకు అసంతృప్తిని కలిగించింది. నాకు ఈ అవార్డు రావడం గర్వంగా ఉన్నా.. బ్యాగీ గ్రీన్ క్యాప్ ధరించడం మాత్రం నచ్చలేదు' అని బెన్ స్టోక్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. దీనిపై ఐసీసీ తనదైన శైలిలో స్పందించింది. 'సారీ బెన్ స్టోక్స్' అంటూ ఒక లాఫింగ్ ఎమోజీని జత చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది.

బెన్‌ స్టోక్స్‌ ఈ దశాబ్దంలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు సాధించాడన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2019లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో తొలిసారి ఇంగ్లండ్‌ జట్టు విశ్వవిజేతగా నిలవడంలో స్టోక్స్‌ కీలకపాత్ర పోషించాడు. తనదైన శైలిలో బ్యాటింగ్, బౌలింగ్ చేసి ఇంగ్లండ్‌ కలను నెరవేర్చాడు. కాగా ఇంగ్లండ్‌ తరపున స్టోక్స్‌ 67 టెస్టుల్లో 4428 పరుగులు, 158 వికెట్లు.. 95 వన్డేల్లో 2682 పరుగులు, 70 వికెట్లు తీశాడు. ఇక 29 టీ20ల్లో 358 రన్స్, 16 వికెట్లు పడగొట్టాడు.

టెస్టు టీమ్‌: అలిస్టర్‌ కుక్‌, డేవిడ్‌ వార్నర్‌, కేన్‌ విలియమ్సన్‌, విరాట్ కోహ్లీ, స్టీవ్‌ స్మిత్‌, కుమార సంగక్కర (వికెట్‌ కీపర్‌), బెన్‌ స్టోక్స్‌, అశ్విన్‌, డేల్‌ స్టెయిన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, జేమ్స్‌ ఆండర్సన్‌.

వన్డే టీమ్‌: రోహిత్‌ శర్మ, డేవిడ్‌ వార్నర్‌, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌, షకీబ్‌ అల్‌ హసన్‌, ఎంఎస్ ధోనీ (వికెట్‌ కీపర్‌, కెప్టెన్‌), బెన్ ‌స్టోక్స్, మిచెల్‌ స్టార్క్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, ఇమ్రాన్‌ తాహిర్‌, లసిత్ మలింగ.

Story first published: Friday, January 1, 2021, 12:32 [IST]
Other articles published on Jan 1, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+