
హైదరాబాద్: దేశ క్రికెట్‌ను ప్రమోట్ చేస్తూ.. జాతీయ జట్టు క్రికెట్ బోర్డులు ట్విట్టర్‌లో మ్యాచ్, పిచ్, ప్లేయర్ల గురించి ట్వీట్ చేస్తూ ఉంటాయి. సదరు సమాచారాన్ని స్థాయిని బట్టి క్రికెట్ అభిమానులతో పంచుకునేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కూడా ట్విట్టర్ ద్వారా పంచుకుంటుంది. ఇలాగే చేసిన ఐసీసీ చేసిన ఓ ట్వీట్‌ను అపార్థం చేసుకున్నారు పాక్ క్రికెట్ అభిమానులు. ఆ ట్వీట్‌ను తప్పుగా అర్థం చేసుకొని ఐసీసీపై మండిపడ్డారు.
చివరకు ఆ ట్వీట్‌పై ఐసీసీ ఇచ్చిన క్లారిటీ ఇవ్వడంతో తమ తప్పును గుర్తించారు. మహిళా టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఐసీసీ.. సెమీస్‌కు చేరే జట్లకు సంబంధించి ట్విటర్ వేదికగా ఓ క్వశ్చన్ పోల్ నిర్వహించింది. ఇందులో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లను ప్రస్తావించింది. సదరు జట్లలో ఏయే జట్లు ఫైనల్‌లో తలపడాలనుకుంటున్నారని అభిమానులను ప్రశ్నించింది.
అయితే ఈ పోల్‌లో ఐసీసీ WT20 హ్యాష్ ట్యాగ్ జత చేయడంతో పాక్ అభిమానులు పురుషుల వరల్డ్ టీ20 అని పొరపాటు పడ్డారు. టీ20ల్లో నెం1 జట్టు అయిన పాక్ లేకపోవడంతో జీర్ణించుకోలేక అసంతృప్తిని వ్యక్తం చేశారు. 'ఐసీసీ ఓ గుడ్డిది.. చెవిటిది.. దానికి కనీసం నెం1 జట్టు ఏంటిదో కూడా తెలియదా?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కామెంట్లతో ఖంగుతిన్న ఐసీసీ.. మహిళా టీ20 ప్రపంచకప్‌లో పాక్ మహిళలు గ్రూప్ స్టేజ్ దాటలేదని స్పష్టం చేసింది. అక్కడితో శాంతించి ట్వీట్ల దాడిని విరమించుకున్నారు. ఇలా పోస్టు అయిన ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ అయ్యాయి.