
సఫారీలను ఇంటికి పంపిన క్యాచ్
గ్రూప్ దశలో సౌతాఫ్రికా ఆడిన చివరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టు అద్భుతంగా ఫీల్డింగ్ చేసింది. ముఖ్యంగా ప్రమాదకర బ్యాటర్ డేవిడ్ మిల్లర్‌ను పెవిలియన్ చేర్చడానికి నెదర్లాండ్స్ వెటరన్ వాన్ డర్ మెర్వ్ అందుకున్న క్యాచ్ ఆ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఈ క్యాచ్‌తో సౌతాఫ్రికా ఓటమి ఖరారైంది.
రైలీ రూసో
పాకిస్తాన్, సౌతాఫ్రికా మ్యాచ్‌లో సఫారీ స్టార్ బ్యాటర్ రైలీ రూసో కూడా సూపర్ క్యాచ్ అందుకున్నాడు. పాకిస్తాన్ బిగ్ హిట్టర్ ఇఫ్తికర్ అహ్మద్ కొట్టిన బంతిని.. బౌండరీ లైన్ వద్ద అద్భుతంగా పట్టేసి జట్టు హ్యాట్రిక్ వికెట్లు నమోదు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు.

పంత్ కొంప ముంచాడు
జింబాబ్వే, భారత్ మధ్య జరిగిన గ్రూప్-2 చివరి మ్యాచ్‌లో అద్భుతమైన ఫీల్డింగ్ అభిమానులకు ఆశ్చర్యం కలిగించింది. గ్యాప్ తర్వాత జట్టుతో చేరిన టీమిండియా యువ స్టార్ రిషభ్ పంత్ లాంగాన్ మీదుగా బౌండరీ బాదేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో అటు వైపు ఫీల్డింగ్ చేస్తున్న ర్యాన్ బర్ల్.. చాలా గ్రౌండ్ కవర్ చేస్తూ వచ్చి గాల్లోకి డైవ్ చేసి మరీ ఆ క్యాచ్ పట్టేశాడు.

ఆసీస్‌కు పీడకలలు మిగిల్చిన క్యాచ్
టోర్నీ సూపర్-12 ఆరంభంలో న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు చేసిన న్యూజిల్యాండ్.. ఆస్ట్రేలియాకు గెలిచే అవకాశమే ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఆసీస్ బిగ్ హిట్టర్ మార్కస్ స్టొయినిస్‌ను పెవిలియన్ పంపేందుకు గ్లెన్ ఫిలిప్స్ అందుకున్న క్యాచ్ హైలైట్‌గా నిలిచింది.
బ్రిలియంట్ క్యాచ్
ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ హజ్రతుల్లా జజాయ్‌ను పెవిలియన్ చేర్చేందుకు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ పట్టిన క్యాచ్ అద్భుతమనే చెప్పాలి. చాలా దూరం నుంచి పరిగెత్తుకు వచ్చిన లివింగ్‌స్టోన్.. డైవ్ చేసి మరీ లో క్యాచ్ అందుకున్నాడు.
బట్లర్ ఒంటిచేత్తో..
ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడిన మ్యాచుల్లో పది మంది ఆటగాళ్లను క్యాచ్ అవుట్‌గానే పెవిలియన్ చేర్చింది ఇంగ్లిష్ జట్టు. ఈ క్రమంలోనే ఆఫ్ఘాన్ కెప్టెన్ మహమ్మద్ నబీ గ్లౌవ్‌ను తాకి వచ్చిన బంతిని బట్లర్ ఒంటిచేత్తో పట్టేయడం చూసిన వాళ్లంతా షాకైపోయారు.

7. మ్యాక్సీకి కళ్లెం
శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో 'బిగ్ షో' మ్యాక్స్‌వెల్ భారీ షాట్ ఆడాడు. సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా వచ్చిన ఆషెన్ బందార.. ఈ బౌండరీ రోప్ వద్ద ఈ క్యాచ్ అందుకొని, బౌండరీపై పడిపోకుండా అద్భుతంగా బ్యాలెన్స్ చేసుకున్నాడు.
ఆఫ్ఘన్ మ్యాచ్‌లో మరో సూపర్ క్యాచ్
ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చాలా అద్భుతమైన క్యాచ్‌లు నమోదయ్యాయి. వాటిలో నజిబుల్లా జద్రాన్‌ది ఒకటి. అతను కొట్టిన బంతి గాల్లో బాగా ఎత్తుగా లేచి బౌండరీ లైన్ ఇవతలే సేఫ్‌గా పడేలా కనిపించింది. కానీ చాలా గ్రౌండ్ కవర్ చేసిన అదిల్ రషీద్.. ముందుకు దూకి మరీ అద్భుతమైన క్యాచ్ పట్టేశాడు.
రషీద్ ఖాన్ క్రియేటివ్ క్యాచ్
ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బ్యాటుతో చెలరేగాడు. అయితే అంతకుముందు ఫీల్డింగ్‌లో కూడా ఆకట్టుకున్న అతను.. ప్యాట్ కమిన్స్ గాల్లోకి లేపిన బంతిని క్రియేటివ్‌గా పట్టేశాడు. క్యాచ్ అందుకొని అతను జారుకుంటూ పోవడం అభిమానులు అంత ఈజీగా మర్చిపోలేరు.

బాబరే షాక్
జింబాబ్వే చేతిలో పాకిస్తాన్ చివరి బంతికి పరాజయం పాలైనా కూడా.. అంతకుముందు రెగీస్ చకాబ్వాను అవుట్ చేసేందుకు బాబర్ ఆజమ్ అందుకున్న క్యాచ్‌ను ఎవరూ నమ్మలేకపోయారు. చకాబ్వా క్రీజులోకి రాగానే మొదటి స్లిప్స్‌లో చేరిన బాబర్.. అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకొని గాల్లోకి లేచిన బంతిని చటుక్కున పట్టేశాడు. అది ఎంత షార్ప్ క్యాచ్ అంటే.. బాబరే తను ఆ క్యాచ్ పట్టానంటే నమ్మలేక ఆశ్చర్యపోయాడు.


Click it and Unblock the Notifications












