Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచకప్‌లో బెస్ట్ మ్యాచులు.. జాబితా ప్రకటించిన ఐసీసీ

 ICC releases best matches of super 12 stage

ప్రపంచకప్ 20 జట్ల మధ్య జరిగినా కూడా కేవలం సూపర్-12 దశలోనే ఎంటర్‌టైన్‌మెంట్ అంతా ఉంటుంది. ఈ ఏడాది మొదటి రౌండ్‌లోనే షాకింగ్ ఫలితాలు కనిపించాయి. ఈ దశలోనే వెస్టిండీస్ మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే రెండు సార్లు కప్పు గెలుచుకున్న ఈ జట్టు.. కనీసం సూపర్-12 దశకు కూడా చేరుకోలేకపోవడం అందరికీ షాకిచ్చింది.

టాప్ మ్యాచులు..

టాప్ మ్యాచులు..

ఈ టోర్నీలో ఉత్కంఠ భరిత మ్యాచులు, సంచలన విజయాలు అన్నీ కనిపించాయి. ముఖ్యంగా సూపర్-12 దశలో కొన్ని సంచలన విజయాలు క్రికెట్ ప్రపంచానికే షాకిచ్చాయి. ఇదే విషయాన్ని ఐసీసీ కూడా తెలిపింది. ఈ క్రమంలోనే సూపర్-12 దశలో బెస్ట్ మ్యాచుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 8 మ్యాచుల వివరాలున్నాయి.

రెండో స్థానంలో భారత్-పాక్

రెండో స్థానంలో భారత్-పాక్

ఐసీసీ ప్రకటించిన జాబితాలో నెదర్లాండ్స్, సౌతాఫ్రికా మ్యాచ్‌ తొలి స్థానంలో ఉంది. టీ20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా చరిత్రను దృష్టిలో ఉంచుకుంటే.. ఈసారి ఆ జట్టు సెమీస్ చేరకపోవడం అందరికీ పెద్ద షాకే ఇచ్చింది. గ్రూప్ దశలో తమ చివరి మ్యాచ్‌లో సఫారీలు నెదర్లాండ్స్ చేతిలో ఓటమి పాలయ్యారు.

దీనికి తమ బెస్ట్ మ్యాచుల జాబితాలో ఐసీసీ తొలి ర్యాంకు ఇచ్చింది. తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌కు రెండో స్థానం ఇచ్చింది. విరాట్ కోహ్లీ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌తో ఈ మ్యాచ్‌లో భారత్‌ను గెలిపించిన సంగతి తెలిసిందే.

మొత్తం 8 ఏవంటే?

మొత్తం 8 ఏవంటే?

ఐసీసీ ప్రకటించిన బెస్ట్ మ్యాచుల జాబితాలో తొలి రెండు స్థానాలను నెదర్లాండ్స్-సౌతాఫ్రికా, భారత్-పాకిస్తాన్ ఆక్రమించాయి. దానర్థం మిగతా మ్యాచులు తక్కువని కాదు. ఈ టోర్నీలో మరికొన్ని సూపర్ మ్యాచులు కూడా ప్రేక్షకులకు కనిపించాయి. మూడో స్థానంలో ఇంగ్లండ్‌పై ఐర్లాండ్ సంచలన విజయం ఉంది. పాకిస్తాన్‌ను చివరి బంతికి జింబాబ్వే ఓడించిన మ్యాచ్ నాలుగో స్థానంలో నిలిచింది. ఐదో స్థానంలో బంగ్లాదేశ్-జింబాబ్వే, ఆరో స్థానంలో ఆస్ట్రేలియా-ఆఫ్ఘనిస్తాన్, ఏడో స్థానంలో భారత్-సౌతాఫ్రికా, ఎనిమిదో స్థానంలో ఆస్ట్రేలియా-న్యూజిల్యాండ్ మ్యాచులు ఉన్నాయి.

Story first published: Monday, November 7, 2022, 16:28 [IST]
Other articles published on Nov 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+