Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌: టాప్ ప్లేస్‌లో కోహ్లీ.. రెండో స్థానంలో రోహిత్

ICC Rankings : Virat Kohli Remains On Top But Rohit Sharma Bridges The Gap || Oneindia Telugu
ICC Rankings: Virat Kohli remains on top but Rohit Sharma bridges the gap after dominance in ICC World Cup

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్ల హవా కొనసాగుతోంది. ఓపెనర్ రోహిత్ శర్మ వరుస సెంచరీలు చేస్తుండగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీలు సాధిస్తూ టీమిండియాను సెమీఫైనల్లోకి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఫలితంగా ఆదివారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రపంచకప్‌-2019లో 442 పరుగులు చేసి.. ఒక రేటింగ్ పాయింట్ మెరుగుపరుచుకుని 891 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

మరోవైపు రోహిత్ శర్మ కూడా కోహ్లీకి దగ్గరగా వచ్చేసాడు. టోర్నీలో 5 సెంచరీలు చేసిన రోహిత్ (885) రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇది రోహిత్ శర్మకు కెరీర్ అత్యధిక రేటింగ్ పాయింట్లు. పాక్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజామ్ (827) మూడో ర్యాంకుకు పడిపోయాడు. దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ (820), రాస్ టేలర్ (813), డేవిడ్ వార్నర్ (803) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

బౌలర్ల జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉన్న భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన అగ్రస్థానంను నిలబెట్టుకున్నాడు. బుమ్రా ఖాతాలో ప్రస్తుతం 814 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ (758) రెండో ర్యాంకులో కొనసాగుతున్నాడు. ప్యాట్ కమిన్స్ (698), రబాడ (694), ఇమ్రాన్ తాహిర్ (683) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఆల్‌రౌండర్ల జాబితాలో బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్‌ షకీబుల్‌ హసన్‌ (406) టాప్‌ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 316 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ర్యాంక్‌లో నిలిచాడు. జట్టు ర్యాంకింగ్స్‌లో భారత్ 123 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇంగ్లండ్ కూడా 123 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Story first published: Monday, July 8, 2019, 9:45 [IST]
Other articles published on Jul 8, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+