Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టెస్టుల్లో నెంబర్ వన్: ఏడో భారత బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ చరిత్ర

ICC Rankings: Virat Kohli reaches top spot

హైదరాబాద్: ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమిపాలైన, కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. తొలి టెస్టులో విరాట్ కోహ్లీ చేసిన ప్రదర్శన అతడిని ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలబెట్టింది.

తాజాగా ఆదివారం విడుదల చేసిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ను దాటేసి విరాట్ కోహ్లీ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించాడు. టెస్టుల్లో నంబర్‌వన్‌ స్థానానికి చేరుకోవడం కోహ్లీ కెరీర్‌లో ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో ఈ ఘనత సాధించిన ఏడో భారత ఆటగాడిగా అవతరించాడు.

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ (2011) తర్వాత ఈ రికార్డు అందుకున్న క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ప్రస్తుతం స్మిత్ కంటే ఐదు పాయింట్లు ఎక్కువగా ఉన్నాయి. తన ర్యాంకును నిలుపుకోవాలంటే సిరీస్ మొత్తం తన ఫామ్‌ను కొనసాగించాల్సి ఉంటుంది. తొలి టెస్ట్‌కు ముందు కోహ్లి ఖాతాలో 903 పాయింట్లు ఉన్నాయి.

ICC Rankings: Virat Kohli reaches top spot

భారత్ తరుపున అత్యధిక సునీల్ గవాస్కర్ కంటే 13 పాయింట్లు వెనుకబడి ఉండగా.. ఇప్పుడతని కంటే 18 పాయింట్లు ఎక్కువగా సాధించాడు. గతంలో సచిన్‌, రాహుల్‌ ద్రవిడ్‌, గౌతం గంభీర్‌, సునీల్‌ గవాస్కర్‌, సెహ్వాగ్‌, దిలీప్‌ వెంగ్‌సర్కార్‌లు టెస్టుల్లో నంబర్ వన్ ర్యాంకుని అందుకున్నవారిలో ఉన్నారు.

1
42374


తన కెరీర్‌లో 67 టెస్టు మ్యాచ్ ఆడిన కోహ్లీ ఇప్పుడు ఈ ఘనతను సాధించాడు. కాగా, ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో కోహ్లీ రెండు ఇన్నింగ్స్‌లో కలిపి మొత్తం 200 పరుగులు చేశాడు. దీంతో 31 పాయింట్లు సాధించి బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్ స్థానానికి చేరుకున్నాడు.

ఈ జాబితాలో గత 32 నెలలుగా తొలిస్థానంలో కొనసాగుతున్న స్టీవ్‌ స్మిత్‌(929 పాయింట్లు)ను 5 పాయింట్లతో కోహ్లీ(934 పాయింట్లు) వెనక్కి నెట్టాడు. టెస్టు బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్‌కు చెందిన జేమ్స్ అండర్సన్‌ తొలి స్థానంలో కొనసాగుతుండగా భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 3, అశ్విన్‌ 5 స్థానాల్లో కొనసాగుతున్నారు.

Story first published: Monday, August 6, 2018, 18:27 [IST]
Other articles published on Aug 6, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+