
హైదరాబాద్: కోహ్లీతో పాటు అతని ర్యాంకు కూడా విశ్రాంతి తీసుకున్నట్లుంది. అంతకుముందు స్థానం నుంచి కదలకుండా స్థిరంగా ఉంది. టాప్ 2 పొజిషన్‌లో కోహ్లీ కొనసాగుతుండగా.. టాప్ 1 పొజిషన్‌లో స్టీవ్ స్మిత్ ఉన్నాడు. మరో భారత ఆటగాడు పూజారాకు స్థానం మెరుగై ఆరో స్థానం దక్కింది.
ఐసీసీ తాజాగా టెస్టు ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. తాజా ర్యాంకింగ్స్‌లో భారత పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ 912 పాయింట్లతో యాథాతథంగా రెండో స్థానంలోనే.. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్(947), ఇంగ్లాండ్‌కు చెందిన జో రూట్(881) ఒకటి, మూడు స్థానాల్లో నిలిచారు.
మరో భారత ఆటగాడు పుజారా(810) మాత్రమే టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం అతడు ఆరో ర్యాంకుతో సరిపెట్టుకున్నాడు. ఇక బౌలర్ల జాబితాను పరిశీలిస్తే జేమ్స్ అండర్సన్(ఇంగ్లాండ్, 887), రబాడ(దక్షిణాఫ్రికా, 873), రవీంద్ర జడేజా(భారత్, 844) తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు.
స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ ఒక స్థానం కోల్పోయి ఆరో స్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. బంగ్లాదేశ్‌కు చెందిన షకీబ్ ఆల్ హాసన్ యథావిధిగా అగ్రస్థానంలోనే ఉన్నాడు.