Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సూర్య‌ను దెబ్బకొట్టిన పగోడు.. అగ్రస్థానం చేజారె!

టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని సూర్య కోల్పోయాడు. ఓ ర్యాంక్‌ను కోల్పోయి రెండో ర్యాంక్‌లో నిలిచాడు. 601 రోజుల నుంచి టీ20ల్లో వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా సూర్య కొనసాగిన విషయం తెలిసిందే. అయితే అమెరికాలోని స్లో పిచ్‌లు కారణంగా తక్కువ స్కోర్లకే వెనుదిరగడం, అంతేగాక నిదానమైన ఇన్నింగ్స్‌లు తన రేటింగ్ పాయింట్లపై ప్రభావం చూపించాయి.

మరోవైపు ఐసీసీ టోర్నీల్లో భారత్‌తో మ్యాచ్ అంటే చెలరేగే ట్రావిస్ హెడ్ టాప్ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. ఏకంగా నాలుగు స్థానాలు ఎగబాకి అగ్రస్థానంలో నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్‌ను దెబ్బకొట్టి 844 రేటింగ్ పాయింట్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు. సూపర్-8లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ 43 బంతుల్లో 76 పరుగులు చేశాడు.

ICC Rankings Travis Head Overtakes Suryakumar Yadav as World s Top T20I Batsman

ఈ ప్రపంచకప్‌లో హెడ్ ఏడు ఇన్నింగ్స్‌‌ల్లో 42 సగటు, 158 స్ట్రైక్‌రేటుతో 255 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ ఆరు మ్యాచ్‌ల్లో 29 సగటు, 139 స్ట్రైక్‌రేటుతో 149 పరుగులే చేశాడు. అమెరికాలోని నాసా కౌంటీ స్టేడియంలో సూర్య పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. అయితే సూర్య 842 రేటింగ్ పాయింట్లతో ఉన్నాడు. హెడ్ కంటే రెండు రేటింగ్ పాయింట్ల తక్కువ. సెమీఫైనల్, ఫైనల్‌లో సత్తాచాటితే సూర్య తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవచ్చు.

ఇక ఫిలిప్ స్టాల్, బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ మూడు, నాలుగు, అయిదు ర్యాంక్‌ల్లో ఉన్నారు. భారత యువ బ్యాటర్ యశస్వీ ఏడో ర్యాంక్‌లో నిలిచాడు. ఆస్ట్రేలియాపై 92 పరుగులు చేసిన రోహిత్ 13 ర్యాంక్‌లు ఎగబాకి 38వ స్థానంలో కొనసాగుతున్నాడు. టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఆదిల్ రషీద్, రషీద్ ఖాన్, హసరంగ టాప్-3లో ఉన్నారు. భారత్ బౌలర్లు అక్షర్ పటేల్ 8 స్థానంలో, కుల్‌దీప్ యాదవ్ 11 స్థానంలో కొనసాగుతున్నారు. కుల్‌‌దీప్ 20 స్థానాలు ఎగబాకి 11 ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో హార్దిక్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని మూడో ర్యాంక్‌లో ఉన్నాడు. టాప్‌లో హసరంగ ఉన్నాడు.

Story first published: Wednesday, June 26, 2024, 15:28 [IST]
Other articles published on Jun 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+