Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ICC Rankings: రోహిత్ శ‌ర్మ‌, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్ ర్యాంకులు ప‌దిలం.. టాప్‌లో ఎవ‌రంటే..

ICC Rankings: Ranks of Rohit Sharma, Virat Kohli and KL Rahul are consistent

ఐసీసీ తాజాగా వ‌న్డే, టీ20 ర్యాంకింగ్స్ విడుద‌ల చేసింది. ఈ ర్యాంకుల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ త‌మ స్థానాల‌ను కాపాడుకున్నారు. టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కేఎల్ రాహుల్ నాల్గో స్థానంలో కొన‌సాగుతుండ‌గా.. విరాట్ కోహ్ల ప‌దో స్థానంలో స్థిరంగా ఉన్నాడు. టీ20 బౌలింగ్ విభాగంలో భార‌త్ నుంచి ఎవ‌రు కూడా టాప్ 10లో స్థానం సంపాదించుకోలేక‌పోయారు. దక్షిణాఫ్రికా బౌలర్ షంసీ ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు. వన్డే ర్యాంకింగ్స్​ బ్యాటింగ్ విభాగంలో విరాట్‌ కోహ్లీ రెండో స్థానంలో, రోహిత్ శర్మ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్​ అజామ్​ తొలి స్థానంలో ఎలాంటి మార్పు లేదు. ఇక మిగ‌తా బ్యాట‌ర్ల విష‌యానికొస్తే శ్రేయస్ అయ్యర్, సూర్య కుమార్ యాద‌వ్‌, రిష‌బ్‌ పంత్ తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు. పంత్ 71వ స్థానంలోకి ఎగ‌బాకాడు. బౌలింగ్ విభాగంలో బుమ్రా ఎప్పటిలాగే ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్డ్​ మొద‌టి స్థానంలో కొన‌సాగుతున్నాడు.

టీ20 బౌలింగ్ విభాగంలో సౌతాఫ్రికా బౌల‌ర్ షంసీ టాప్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియా పేస‌ర్ జోష్ హేజిల్‌వుడ్ రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్ద‌రికీ ఒక‌టే పాయింట్ తేడా ఉండ‌డం గ‌మ‌నార్హం. శ్రీ‌లంక స్పిన్న‌ర్ హ‌స‌రంగ మూడో స్థానంలో, ఇంగ్లండ్ స్పిన్న‌ర్ ఆదిల్ ర‌షీద్ నాల్గో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా స్పిన్న‌ర్ ఆడ‌మ్ జంపా ఐదో స్థానంలో, ఆఫ్ఘ‌నిస్థాన్ స్పిన్న‌ర్ ర‌షీద్ ఖాన్ ఆరో స్థానంలో ఉన్నారు. ఆల్‌రౌండ‌ర్ల విభాగంలో మ‌హ్మ‌ద్ న‌బీ అగ్ర స్థానంలో ఉన్నాడు. బంగ్లాదేశ్ ఆల్‌రౌండ‌ర్ ష‌కీబుల్ హాస‌న్ రెండు, ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్ మొయిన్ అలీ మూడో స్థానంలో ఉన్నారు.

ICC Test Rankings: Virat Kohli Drops To 9th | IND VS SA | Oneindia Telugu

టీ20 బ్యాటింగ్ విభాగంలో పాకిస్తాన్ ఓపెన‌ర్లు బాబ‌ర్ అజామ్, మ‌హ్మ‌ద్ రిజ్వాన్ తొలి రెండు స్థానాల్లో కొన‌సాగుతున్నారు. సౌతాఫ్రికా బ్యాట‌ర్ ఐడెన్ మాక్ర‌మ్ మూడో స్థానంలో, ఇంగ్లండ్ బ్యాట‌ర్ మ‌లాన్ ఐదో స్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండ‌ర్ల విభాగంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ గ్లెయిన్ మాక్స్‌వెల్ నాలుగు, శ్రీ‌లంక ఆల్‌రౌండ‌ర్ హ‌స‌రంగా ఐదో స్థానంలో ఉన్నారు.

Story first published: Wednesday, February 16, 2022, 17:13 [IST]
Other articles published on Feb 16, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+