ICC Rankings: అభిషేక్ శర్మకు బిగ్ షాక్.. నంబర్ 1 స్థానానికి టీ20 వరల్డ్ కప్ హీరో!
ICC Rankings: ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్ల హవా స్పష్టంగా కనిపిస్తోంది. టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారీ మార్పు చోటుచేసుకుంది. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ప్రపంచ నంబర్-1 టీ20 బ్యాటర్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ క్రమంలో గత ఏడాది కాలంగా అగ్రస్థానంలో కొనసాగుతున్న తన తోటి ఆటగాడు అభిషేక్ శర్మను ఇషాన్ కిషన్ కిందకు నెట్టేశాడు. తాజా లెక్కల ప్రకారం.. ప్రస్తుతం ఈ ఇద్దరు భారత బ్యాటర్ల మధ్య కేవలం 7 రేటింగ్ పాయింట్ల స్వల్ప తేడా మాత్రమే ఉంది. ఈ ఘనతతో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మల తర్వాత టీ20 ఇంటర్నేషనల్స్‌లో నంబర్-1 స్థానాన్ని అందుకున్న నాలుగో భారతీయ బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ రికార్డు సృష్టించాడు.
ఇషాన్ కిషన్ ఈ రేంజ్‌లో నంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లడానికి ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్ 2026లో అద్భుతంగా రాణించడమే ఇందుకు కారణం. ఈ టోర్నీలో ఇషాన్ కిషన్ దాదాపు 200 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 317 పరుగులు సాధించాడు. మరోవైపు ఇటీవల భారత్‌పై చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన ఐర్లాండ్ జట్టు ఆటగాళ్లకు కూడా ఈ ర్యాంకింగ్స్‌లో భారీ ప్రయోజనం చేకూరింది. ఐర్లాండ్ బ్యాటర్ లోర్కాన్ టక్కర్ 4 స్థానాలు ఎగబాకి సంయుక్తంగా 77వ స్థానానికి.. రాస్ అడైర్ 6 స్థానాలు మెరుగుపరుచుకుని 84వ స్థానానికి చేరుకున్నారు. భారత్‌తో జరిగిన సిరీస్‌లో 4 వికెట్లు తీసిన ఐర్లాండ్ లెఫ్టార్మ్ పేసర్ మాథ్యూ హంఫ్రీస్ తన కెరీర్ బెస్ట్ 25వ ర్యాంకుకు చేరుకున్నాడు. అలాగే భారత ఆల్‌రౌండర్ శివమ్ దూబే 3 స్థానాలు ఎగబాకి ఆల్‌రౌండర్ల జాబితాలో 7వ స్థానానికి చేరుకున్నాడు.

ఈ ఐసీసీ ర్యాంకింగ్స్ మార్పులు కేవలం టీ20లకే పరిమితం కాలేదు. టెస్ట్ క్రికెట్లోనూ కొత్త కింగ్స్ ఎంట్రీ ఇచ్చారు. ఆస్ట్రేలియా డ్యాషింగ్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ తన కెరీర్లో తొలిసారిగా ప్రపంచ నంబర్-1 టెస్ట్ బ్యాటర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు హ్యారీ బ్రూక్, జో రూట్ ఘోరంగా విఫలం కావడంతో వారి ర్యాంకులు పడిపోయాయి. హ్యారీ బ్రూక్ రెండో స్థానానికి, జో రూట్ మూడో స్థానానికి పడిపోయారు. ఇదే సమయంలో ఇంగ్లండ్‌పై అద్భుత విజయం సాధించిన కివీస్ జట్టు ఆటగాళ్లు రచిన్ రవీంద్ర(7వ స్థానం), డారిల్ మిచెల్(11వ స్థానం), డెవాన్ కాన్వే(15వ స్థానం) తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు.
ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. టెస్ట్ క్రికెట్లో భారత్ స్టార్ యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి ప్రపంచ నంబర్ వన్ టెస్ట్ బౌలర్ కిరీటాన్ని కైవసం చేసుకున్నాడు. న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీని వెనక్కి నెట్టి బుమ్రా ఈ అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ టెస్ట్ ఆల్‌రౌండర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచి తన సుదీర్ఘ కెరీర్‌ను ఘనంగా ముగించగలిగాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications