న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ ర్యాంకింగ్స్‌: టెస్టుల్లో భారత్, వన్డేల్లో ఇంగ్లాండ్ నంబర్‌వన్‌

ICC Rankings : India Retain Top Spot In Tests, England No. 1 In ODIs || Oneindia Telugu
ICC rankings: India retains No. 1 Test, England top in ODIs

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వార్షిక అప్ డేట్ తర్వాత.. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో టెస్టుల్లో భారత్, వన్డేల్లో ఇంగ్లాండ్ నంబర్‌వన్‌గా ర్యాంకును నిలబెట్టుకున్నాయి. 2015-16 నుంచి సిరీస్ ఫలితాలను తొలగించిన తర్వాత ర్యాంకింగ్స్‌లో అప్ డేట్ చేస్తున్నట్టు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. 2016-17, 2017-18 ఫలితాల 50% పాయింట్లను ఇందులో కలిపింది.

ఇంగ్లాండ్ @ 1:

ఇంగ్లాండ్ @ 1:

వన్డే ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ (123) మొదటి స్థానంలో ఉండగా.. భారత్ (121) రెండో స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య తేడా కేవలం రెండు పాయింట్లు మాత్రమే. న్యూజిలాండ్ (113) జట్టును వెనక్కి నెట్టి దక్షిణాఫ్రికా (115) మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్, శ్రీలంక, ఆఫ్ఘానిస్తాన్ టాప్ 10లో ఉన్నాయి.

 నంబర్‌వన్‌ జట్టుగా బరిలోకి దిగాలంటే:

నంబర్‌వన్‌ జట్టుగా బరిలోకి దిగాలంటే:

వన్డే ర్యాంకింగ్ లో ఇంగ్లాండ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నా.. ప్రపంచకప్‌లో నంబర్‌వన్‌ జట్టుగా బరిలోకి దిగడానికి ముందు ఆడబోయే ఒకే ఒక్క వన్డేలో ఐర్లాండ్ ను ఓడించాల్సి ఉంటుంది. తర్వాత పాకిస్థాన్ తో జరిగే సిరీస్‌లో 3-2తో విజయం సాధించాలి. ఒకవేళ ఐర్లాండ్ తో మ్యాచ్ ఓడిపోతే.. పాకిస్థాన్ ను 4-1తో లేదా అంత కంటే మెరుగైన తేడాతో ఓడించాలి.

 భారత్ @ 1:

భారత్ @ 1:

టెస్ట్ ర్యాంకింగుల్లో భారత్ (113) నంబర్‌వన్‌ ర్యాంకును నిలబెట్టుకుంది. న్యూజిలాండ్‌ (111) నుంచి పోటీ ఎదురైనా నంబర్‌వన్‌ ర్యాంకును కాపాడుకుంది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఉన్న 8 పాయింట్ల తేడా ఇప్పుడు 2 పాయింట్లకు చేరింది. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, పాకిస్థాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, జింబాంబ్వే ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Story first published: Friday, May 3, 2019, 12:24 [IST]
Other articles published on May 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X