వైట్‌వాష్ అయినా టాప్‌లోనే భారత్.. రెండో స్థానంలో కోహ్లీ!!

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ తన అగ్రస్థానాన్ని కాపాడుకుంది. తాజాగా న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్‌ను 0-2తో కోల్పోయిన భారత్.. 116 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. 110 పాయింట్లతో న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉంది. రెండో స్థానంలో ఉన్న కివీస్ కంటే 6 పాయింట్ల ఆధిక్యంలో మాత్రమే భారత్ ఉంది. ఇక మూడో స్థానంలో ఆస్ట్రేలియా (108) నిలిచింది.

రెండో స్థానంలో కోహ్లీ
బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే అగ్రస్థానంలో ఉన్న ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (911), కోహ్లీ మధ్య అంతరం 25 పాయింట్లకు చేరింది. కోహ్లీ టెస్టుల్లో విఫలమవడమే ఈ అంతరం పెరగడానికి కారణం. విరాట్ మరీ దారుణంగా 9.50 సగటుతో 38 పరుగులే చేశాడు. రెండు టెస్టుల్లో కోహ్లీ వరుసగా 2, 19, 3, 14 పరుగులు చేశాడు. కివీస్ సిరీస్‌తో పునరాగమనం చేసిన ఓపెనర్ పృథ్వీ షా 17 స్థానాలు ఎగబాకి 76 ర్యాంక్‌లో నిలిచాడు.

పుజారా @ 7
టీమిండియా మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (11) టాప్-10లో చోటు కోల్పోయాడు. టాప్-10లో విరాట్ కోహ్లీతో పాటు భారత్ నుంచి ఛతేశ్వర పుజారా (7), అజింక్య రహానె (9)లు మాత్రమే ఉన్నారు. కివీస్ బ్యాట్స్‌మెన్‌లో ఓపెనర్ టామ్ బ్లండెల్ 27 ర్యాంక్‌లను మెరుగుపర్చుకుని 46వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

ఏడో స్థానంలో బుమ్రా
బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా టాప్ 10లో నిలిచాడు. 779 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నాడు. కివీస్ బౌలర్లలో టీమ్ సౌథీ (4), ట్రెంట్ బౌల్ట్ (9), కైల్ జేమీసన్ (43) తమ ర్యాంక్‌లను మెరుగుపర్చుకున్నారు. జేమీసన్ 80వ స్థానంలో నుంచి 43 ర్యాంక్‌కు దూసుకొచ్చాడు. అగ్రస్థానంలో ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్ ఉన్నాడు. ఇక ఆల్‌రౌండర్ జాబితాలో టీమిండియా నుంచి రవీంద్ర జడేజా (3), రవిచంద్రన్ అశ్విన్ (5) టాప్ 10లో ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications