క్లీన్ స్వీప్: టీ20ల్లో నెంబర్ వన్ స్ధానానికి భారత్
సిడ్నీ: టెస్టుల్లో ఇటీవలే నెంబర్ వన్ ర్యాంక్‌ను అందుకున్న భారత్, తాజాగా టీ20 ఫార్మెట్‌లోనూ నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడంతో టీ20 ర్యాంకుల్లో టాప్ ర్యాంకు ధోనీ సేన సొంతమైంది. ఆదివారం విడుదల చేసిన టీ20 ర్యాంకుల్లో వెస్టిండీస్‌ను వెనక్కి నెట్టి భారత్ అగ్రస్థానానికి చేరుకుంది.
వరుసగా మూడు టీ20ల్లో విజయం సాధించిన టీమిండియా 120 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానానికి చేరింది. వెస్టిండీస్ 118 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. శ్రీలంక కూడా 118 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఇక వరుసగా మూడు టీ20ల్లోనూ పరాజయం చవిచూసిన ఆసీస్ జట్టు 110 రేటింగ్ పాయింట్లతో ఏకంగా ఎనిమిదో స్థానానికి పడిపోయింది.
ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇది ఇలా ఉంటే వన్డేల్లో భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆదివారం నాటి విజయంతో 139 ఏళ్ల రికార్డును ధోని సేన బద్దలు కొట్టింది.

ICC T20I Rankings (As on January 31 after India-Australia series):
Note: As on today, India are also number 1 in Tests. In ODIs, they are number 2
1. India (120 Rating Points)
2. West Indies (118)
3. Sri Lanka (118)
4. England (117)
5. New Zealand (116)
6. South Africa (115)
7. Pakistan (113)
8. Australia (110)
9. Afghanistan (80)
10. Scotland (66)
11. Bangladesh (64)
12. Hong Kong (7)
13. The Netherlands (61)
14. Zimbabwe (54)
15. Ireland (42)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications