కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 192 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. మరో 14 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను ఇంగ్లీష్ జట్టు 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా మూడు వికెట్లకు 191 పరుగులు చేసింది. వాండర్ డసెన్ (74, 32 బంతుల్లో, 5×4, 5×6), ఫాఫ్ డుప్లెసిస్ (52; 37 బంతుల్లో, 5×4, 3×6) అర్ధ శతకాలతో మెరిశారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 127 రన్స్ జోడించారు.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ వికెట్ కోల్పోయి 17.4 ఓవర్లలోనే ఛేదించింది. డేవిడ్ మలన్ (99; 47 బంతుల్లో, 11×4, 5×6) విధ్వంసం సృష్టించగా.. జోస్ బట్లర్ (67; 46 బంతుల్లో, 3×4, 5×6) అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించారు. ఈ సిరీస్ విజయంతో ఇంగ్లండ్ (275) తమ రేటింగ్ పాయింట్లు మెరుగుపర్చుకుని టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. తర్వాతి స్థానాల్లో వరుసగా ఆస్ట్రేలియా (275), భారత్ (266), పాకిస్థాన్ (262), దక్షిణాఫ్రికా (252) జట్లు ఉన్నాయి.
ఇక వన్డే ర్యాంకింగ్స్‌లో కూడా ఇంగ్లండ్ అగ్ర స్థానంలో ఉంది. 123 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లీష్ జట్టు టాప్‌లో కొనసాగుతోంది. 2019 ప్రపంచకప్ నుంచి ఇంగ్లండ్ మంచి ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇక 116 రేటింగ్ పాయింట్లతో భారత్ రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియాపై రెండు వన్డేల్లో ఓడినా.. టీమిండియా తమ స్థానాన్ని కాపాడుకుంది. అంతకుముందు న్యూజీలాండ్ జట్టుతో జరిగిన మూడు వన్డేల్లో ఓడిన విషయం తెలిసిందే. 116 రేటింగ్ పాయింట్లతో న్యూజీలాండ్ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా (113), దక్షిణాఫ్రికా (108) టాప్-5లో ఉన్నాయి.
బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో డేవిడ్ మలన్ (877) టాప్‌లో ఉన్నాడు. బాబర్ ఆజమ్ (871), ఆరోన్ ఫించ్ (835), కేఎల్ రాహుల్ (824), కోలిన్ మున్రో (785) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో రషీద్ ఖాన్ (736) అగ్ర స్థానంలో ఉన్నాడు. టాప్10లో కూడా ఒక్క భారత బౌలర్ లేడు. వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ (871) అగ్ర స్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ (855) రెండో స్థానంలో ఉన్నాడు. వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ట్రెంట్ బౌల్ట్ (722), జస్ప్రీత్ బుమ్రా (719) టాప్-2లో ఉన్నారు.
LPL 2020: నవీన్‌ను తిట్టలేదు.. సూచన మాత్రమే ఇచ్చా: అఫ్రిది