Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐసీసీ ర్యాంకులు: కోహ్లీ అగ్రస్థానానికి ఎసరు పెట్టిన న్యూజిలాండ్ కెప్టెన్!

ICC Test Rankings: Virat Kohli Maintains NO.1 Spot In ICC Test Rankings!! | Oneindia Telugu
ICC Rankings: Chance for Anderson to regain top spot


హైదరాబాద్: ప్రపంచకప్ ముగిసింది. ప్రస్తుతం అన్ని జట్లకు చెందిన క్రికెటర్లు హాలిడే మూడ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆగస్టు నుంచి కొత్త సీజన్‌ ఆరంభమవుతోంది. ఈ సీజన్‌లో భాగంగా టీమిండియా త్వరలో వెస్టిండిస్‌లో పర్యటించనుంది. ఆగస్టు 3 నుంచి ఆరంభమయ్యే ఈ సిరిస్‌లో కోహ్లీసేన 3 వన్డేలు, 3 టీ20లు, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది.

మీకోసం: ప్రో కబడ్డీ 7వ సీజన్ స్పెషల్ సైట్

మరోవైపు ఆగస్టు 1 నుంచి ఇంగ్లాండ్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య యాషెస్‌ టెస్టు సిరిస్ ప్రారంభం కానుంది. ఇక, బంగ్లాదేశ్‌ జట్టు ఇప్పటికే శ్రీలంక పర్యటనలో ఉంది. ఈ నేపథ్యంలో ఐసీసీ తాజా టెస్టు ర్యాంకులను ప్రకటించింది. టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ 922 పాయింట్లతో బ్యాటింగ్‌ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(913) పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. వీరిద్దరి మధ్య అంతరం కేవలం 9 పాయింట్లే ఉన్నాయి. పుజారా (881) పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుండగా857 పాయింట్లతో స్టీవ్ స్మిత్ నాలుగో స్థానంలో ఉన్నాడు. యాషెస్ టెస్టు సిరిస్‌లో రాణించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని చూస్తున్నాడు.

ఇక, బౌలర్ల జాబితా విషయానికి వస్తే ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ అగ్రస్థానంపై కన్నేశాడు. యాషెస్ టెస్టు సిరిస్‌కు ముందు ఇంగ్లాండ్ జట్టు ఐర్లాండ్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడనుంది. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ టెస్టు బుధవారం నుంచి లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ప్రారంభం కానుంది.

బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ప్యాట్‌ కమిన్స్‌, జిమ్మీ అండర్సన్‌, కాగిసో రబాడ వరుసగా తొలి మూడు స్థానాల్లో కొనసాగుతుండగా... భారత్‌ నుంచి రవీంద్ర జడేజా ఆరో స్థానంలో... రవిచంద్రన్‌ అశ్విన్‌ పదో ర్యాంకులో కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో టీమిండియా నుంచి ఒక్కడే టాప్‌-10లో ఉన్నాడు.

ఇక, టీమ్ ర్యాంకుల విషయానికి వస్తే టీమిండియా తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Story first published: Tuesday, July 23, 2019, 18:53 [IST]
Other articles published on Jul 23, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+